ఇంతకీ అర్జున్ ఎప్పుడు వస్తాడు ?

0

నిఖిల్ కు శకునాలు కలిసి రావడం లేదు. తన కొత్త సినిమా అర్జున్ సురవరం వాయిదాల మీద వాయిదా పడుతూ సరైన విడుదల తేదీ దొరక్క ఎప్పుడు వస్తుందో అర్థం కాక అభిమానులను అయోమయంలో నెట్టెస్తోంది. నిజానికి గత నెల రిలీజ్ చేయాలి అనుకున్నప్పుడు ఎవెంజర్స్ ఎండ్ గేమ్ ప్రభంజనానికి భయపడి వెనుకంజ వేశారు. ఇప్పుడు అదే కొంప ముంచింది.

అవెంజర్స్ ప్రతాపం వారానికే పరిమితమయ్యింది. ఒకవేళ ధైర్యం చేసి అర్జున్ సురవరం అప్పుడే తీసుకొచ్చి ఉంటే సేఫ్ రన్ దక్కేదేమో. సరే అయిందేదో అయ్యింది ఇప్పుడైనా క్లారిటీ ఇవ్వొచ్చుగా అంటే నిర్మాతల నుంచి స్పందన తెలియడం లేదు. వరసగా క్యూ కట్టి ఉన్న టాలీవుడ్ రిలీజుల మధ్య వచ్చేందుకు అర్జున్ తటపటాయిస్తున్నట్టుగా కనిపిస్తోంది

ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాంటెంపరరీ సోషల్ ఇష్యూ కాబట్టి జనానికి బాగా కనెక్ట్ అవుతుందన్న నమ్మకమూ నిఖిల్ లో బలంగా ఉంది. దానికి తోడు ఇది ఆల్రెడీ తమిళ్ లో ప్రూవ్ అయిన హిట్ మూవీ కనితన్ కి రీమేక్. దర్శకుడూ ఒరిజినల్ ని డీల్ చేసిన సంతోషె కాబట్టి రిజల్ట్ గురించి టీం కు ఎలాంటి ఆందోళన లేదు.

మే 9న మహర్షి మొదలుపెట్టిన వరస నుంచి కనీసం రెండు మూడు తెలుగు సినిమాలు ప్రతి శుక్రవారం కర్చీఫ్ వేసుకుని ఉన్నాయి. ఈ స్లాట్ లో అర్జున్ సురవరంని ఎక్కడ ప్లేస్ చేయాలో అర్థం కాకే ఆలస్యం చేస్తున్నట్టు టాక్. ఏదో ఒకటి తేల్చి త్వరగా వదిలితే బెటర్. లేదా ఉన్న బజ్ చల్లరిపోయేలా ఉంది.