అరిచి గీ పెట్టినా అప్పటి వరకు ఆగాల్సిందే డార్లింగ్స్!

0

ప్రభాస్ 20వ చిత్రం ప్రారంభం అయ్యి దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతుంది. సాహో సినిమా విడుదలకు ముందే ఒక షెడ్యూల్ పూర్తి అయినట్లుగా ప్రకటించారు. సాహో చిత్రం విడుదల అయ్యి చాలా కాలం అయ్యింది. అయినా ఇప్పటి వరకు ప్రభాస్ 20వ చిత్రం జాడా పత్తా లేదు. విదేశాల్లో షూటింగ్ చాలా రోజులు చేశారు. అయినా ఇప్పటి వరకు సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయలేదు. ఆమద్య ఈ సినిమాను నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ ను బ్యాన్ చేయాలంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. ఆ సమయంలో త్వరలోనే అప్ డేట్ ఇస్తామంటూ యూవీ క్రియేషన్స్ హామీ ఇచ్చింది.

యూవీ క్రియేషన్స్ వారి ప్రకటనతో కాస్త శాంతిచిన ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ప్రభాస్ మూవీ ఫస్ట్ లుక్ ఎక్కడ అంటూ యూవీ క్రియేషన్స్ వారిని ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో కూడా యూవీ క్రియేషన్స్ వారు పెద్దగా స్పందించడం లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఎంత అరిచినా కూడా యూవీ క్రియేషన్స్ మాత్రం ఇప్పట్లో ఫస్ట్ లుక్ ను కాని సినిమాకు సంబంధించిన అప్ డేట్ ను కాని ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ ఇంకా సగం వరకు ఉందట. కనుక ఇప్పుడే ఫస్ట్ లుక్ విడుదల చేయాల్సిన అవసరం లేదని యూనిట్ సభ్యులు భావిస్తున్నారట. అక్టోబర్ నెలలో ప్రభాస్ పుట్టిన రోజు సందర్బంగా 23వ తారీకున సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయాలని అదే సమయంలో టైటిల్ ను కూడా రివీల్ చేసే అవకాశం ఉందని లీక్ ఇచ్చారు. అప్పటి వరకు మళ్లీ ఎలాంటి హడావుడి లేకుండా ప్రభాస్ ఫ్యాన్స్ ను సైలెంట్ చేసేందుకు యూవీ క్రియేషన్స్ వారు ఈ లీక్ ఇచ్చి ఉంటారు అంటున్నారు.

రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. ఆగస్టు నుండి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభించేందుకు భారీ హాస్పిటల్ సెట్ ను నిర్మిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను భారీ ఎత్తున వచ్చే ఏడాదిలో విడుదల చేసే అవకాశం ఉంది.
Please Read Disclaimer