కొత్త బాధ్యతలు తీసుకోబోతున్న చై సామ్ ?

0

మజిలీ-ఓ బేబీ బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ తో ఫుల్ జోష్ మీదున్న సమంతా ఇకపై కూడా డిఫరెంట్ రోల్స్ మాత్రమే చేసేందుకు ప్లానింగ్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. పెళ్లయ్యాక ఎలాగూ గ్లామర్ రోల్స్ తగ్గిపోతాయి కాబట్టి దానికి అనుగుణంగా గ్రాఫ్ తగ్గకుండా నటనకు ఛాలెంజ్ అనిపించే పాత్రలను ఏరికోరి చేస్తున్న సామ్ కు ఓ బేబీ విజయం మాములు ఆనందాన్ని ఇవ్వడం లేదు. కేవలం తన ఇమేజ్ మీదే మార్కెటింగ్ చేసుకున్న ఓ బేబీకి ఇంత స్పందన రావడం చూసి ప్రమోషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.

ఎన్నడూ లేనిది థియేటర్ల విజిట్ కు వెళ్లడం అసలు విశేషం. మజిలీతో పాటు తమిళ్ లో చేసిన సూపర్ డీలక్స్ కూడా సామ్ కు చాలా పేరు తీసుకొచ్చింది. నేటివిటీ ఫాక్టర్ వల్ల మనవాళ్ళు డబ్బింగ్ చేయలేదు కానీ ఇంకో పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ షాకింగ్ రోల్ లో సమంతాను చూసే ఛాన్స్ దక్కేది. అదలా ఉంచితే సామ్ త్వరలో భర్త నాగ చైతన్యతో కలిసి జాయింట్ ప్రొడక్షన్ మొదలుపెట్టబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్. ఓ బేబీ లాంటి హిట్ ఇచ్చిన నందిని రెడ్డి దర్శకత్వంలోనే ఓ థ్రిల్లర్ ని ప్లాన్ చేస్తున్నారట.

ఇది కూడా విమెన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అని సమాచారం. అధికారం చెలాయించే తరహాలో ఉండే ఓ స్పెషల్ రోల్ ని నందిని రెడ్డి తీర్చిదిద్దుతున్నారట. ఓ బేబీ లాగా ఇది కూడా ఏదైనా కొరియన్ రీమేకా లేక ఫ్రెష్ సబ్జెక్టా అనేది ఇంకా తెలియదు. నాగ చైతన్య జాయింట్ పార్ట్ నర్ అయినప్పటికీ ఇందులో మాత్రం నటించే ఛాన్స్ లేదని వినికిడి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకొద్ది రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.
Please Read Disclaimer