వేసవిలో ప్రియుడిని పెళ్ళి చేసుకుంటుందట!

0

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ పేరును తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘సాహో’ లో ప్రభాస్ సరసన నటిస్తున్న హీరోయిన్ కావడంతో శ్రద్ధ తెలుగు ఆడియన్స్ లో పాపులర్ అయిపోయింది. ఈ భామ పెళ్ళి గురించి తాజాగా బాలీవుడ్ లో గుసగుసలు ఎక్కువయ్యాయి. శ్రద్ధ చాలాకాలం నుండి తన చిన్ననాటి స్నేహితుడు రోహన్ శ్రేష్ఠతో లవ్ లో మునిగి తేలుతోందని బాలీవుడ్ లో వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ అటు రోహన్.. ఇటు శ్రద్ధ మాత్రం పెదవి విప్పడం లేదు.

కొద్దికాలం క్రితం శ్రద్ధా నాన్నగారు శక్తి కపూర్ మాట్లాడుతూ అలాంటిదేమీ లేదని.. ఈ ఏడాదిలో శ్రద్ధ పెళ్ళి ఉండదని ఫుల్లుగా క్లారిటీ ఇచ్చాడు. అదేంటో శక్తి గారు క్లారిటీ ఇచ్చినా.. శ్రద్ధా – రోహన్ జంట మాత్రం చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ హిందీలో ఉన్న అన్నీ లవ్ సాంగ్స్ ను ఒక దాని తర్వాత ఇంకోటి పాడుకుంటూ ఉన్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. తాజాగా ఒక పాపులర్ బాలీవుడ్ వెబ్ సైట్ ఈ లవ్ జంట వివాహం మంచి ఎండల్లో ఉంటుందని వెల్లడించింది. అంటే నెక్స్ట్ సమ్మర్లో అన్నమాట.

ఎన్ని కథనాలు వస్తున్నప్పటికీ శ్రద్ధ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పనిలో తాను బిజీగా ఉంది. మరి ‘సాహో’ ప్రమోషన్స్ కు మీడియా ముందుకు వస్తే.. మ్యారేజ్ పై ప్రశ్నలు అడుగుతారు కాబట్టి ఈ విషయంపై మనకు క్లారిటీ వస్తుందేమో. శ్రద్ధా ప్రస్తుతం ‘సాహో’ తోపాటు ‘చిచోరే’.. ‘స్ట్రీట్ డ్యాన్సర్’ అనే బాలీవుడ్ చిత్రాలలో నటిస్తోంది.
Please Read Disclaimer