లెక్కల మాస్టారి లెక్కలు నిజమవుతాయా..?

0

ప్రస్తుతం టాప్ డైరెక్టర్ హోదాలో కొనసాగుతున్న వారిలో మొదటి వరసలో ఉండే దర్శకుడు సుకుమార్. ఈ లెక్కల మాస్టారు తన లెక్కలతో సినిమాల బాక్సాఫీస్ లెక్కలు మార్చేస్తుంటాడు. ‘వన్ సైడ్ లవ్’ అనే కొత్త కాన్సెట్స్ తో ‘ఆర్య’ సినిమా తీస్తాడు. ప్రేక్షకులు కూడా అందుకోలేని స్థాయిలో ఉండే ‘వన్ నేనొక్కడినే’ లాంటి సినిమాలు కుడా తీస్తాడు. ‘నాన్నకు ప్రేమతో’ అంటూ మనసు పెట్టి ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను కూడా తీస్తాడు. అయితే రంగస్థలం వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత సుకుమార్ నుండి మరో సినిమా విడుదల కాలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ఒక మాస్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ లెక్కల మాస్టారుకి కొన్ని సెంటిమెంట్లు కూడా ఎక్కువే. సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్కి కాంబినేషన్లకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారన్న విషయం తెలిసిందే. తాజాగా ఆ లిస్ట్లో చేరిపోయారు దర్శకుడు సుకుమార్.

స్వతహాగా ఎప్పుడూ గడ్డం పెంచుకుని ఉంటే సుక్కు తన సినిమాలో హీరోలకి కూడా గుబురు గడ్డం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ ‘రంగస్థలం’ సినిమాలే దీనికి ఉదాహరణ. ఈ చిత్రాలలో ఎన్టీఆర్ రామ్ చరణ్ గుబురు గడ్డంతో కనిపిస్తారు. అయితే ఇప్పుడు తాను తీస్తున్న కొత్త చిత్రంలో అల్లు అర్జున్ కూడా గుబురు గడ్డంతో దర్శనమిస్తాడని సమాచారం. రీసెంట్ గా రివీల్ అయిన అల్లు అర్జున్ ఫోటోనే దీనికి సాక్ష్యం. ఈ సెంటిమెంటును నిజం చేస్తూ ఆ సినిమాలు విజయాన్ని సాధించగా గడ్డంతో లేని మహేష్ నటించిన వన్ నేనొక్కడినే పరాజయం పాలయింది. ఇప్పుడు ఇదే సెంటిమెంటును నమ్ముతున్న సుక్కు అల్లు అర్జున్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాడంట.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-