యాక్షన్ క్వీన్ ని ఫాలో అవుతోందా?

0

గ్లామర్ క్వీన్స్ కాస్తా యాక్షన్ క్వీన్స్ గా మారుతూ సర్ ప్రైజ్ చేస్తున్నారు. హాలీవుడ్ స్టార్ యాంజెలినా తరహాలో యాక్షన్ నాయికలుగా రాణించాలన్న ఆసక్తి అటు బాలీవుడ్ ఇటు సౌత్ హీరోయిన్లకు బలంగానే ఉందని తాజా సన్నివేశం చెబుతోంది. కాంట్రవర్శీ క్వీన్ కంగన `మణికర్ణిక` లో వారియర్ క్వీన్ ఝాన్సీ లక్ష్మీ భాయ్ పాత్రలో నటించింది. ఆ వెంటనే `ధాకడ్` లాంటి భారీ యాక్షన్ స్క్రిప్టును సెలెక్ట్ చేసుకుని సర్ ప్రైజ్ చేస్తోంది. ఆ ప్రభావం సౌత్ బ్యూటీస్ పైనా పడుతోందా? అంటే అవుననే అర్థమవుతోంది.

ప్రస్తుతం కంగన నటించిన `క్వీన్` రీమేక్ (దటీజ్ మహాలక్ష్మి)లో నటిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నాపైనా ఆ ప్రభావం పడినట్టే కనిపిస్తోంది. ఈ అమ్మడు స్క్రిప్ట్ సెలక్షన్ ప్రాసెస్ పూర్తిగా మారిపోయింది. కంగనను స్ఫూర్తిగా తీసుకుని తనలానే యాక్షన్ క్వీన్ గా మారేందుకు ఆలోచిస్తోందా? అంటే అవుననే తాజాగా ఓ ప్రూఫ్ దొరికింది.

బాహుబలి సిరీస్ లో అవంతికగా నటించిన తమన్నా.. ప్రస్తుతం మెగాస్టార్ `సైరా`లోనూ మరో ఛాలెంజింగ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా ఓ యాక్షన్ స్క్రిప్టును ఎంచుకుంది. ఈ సినిమాలో హీరోకి ధీటుగా రిస్కీ స్టంట్స్ తో ఆద్యంతం ఫ్యాన్స్ ని అవాక్కయ్యేలా చేయబోతోందట. ఇటీవలే తమన్నాపై కొన్ని యాక్షన్ సన్నివేశాల్ని తెరకెక్కించారని తెలుస్తోంది. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విశాల్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇంకా టైటిల్ ని నిర్ణయించాల్సి ఉంది.
Please Read Disclaimer