కిలాడీతో తాప్సీ పందెం నెగ్గుతుందా?

0

నేడు టాలీవుడ్ లో ఇద్దరు కోలీవుడ్ అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇళయదళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన బిగిల్ చిత్రం `విజిల్` టైటిల్ తో అనువాదమవ్వగా.. కార్తీ నటించిన ఖైదీ కూడా రిలీజ్ అయింది. తమిళంలో దూకుడుమీదున్న విజయ్ తో కార్తీ అటు మాతృభాష లో ఇటు పరభాషలోనూ గట్టిపోటీని ఎదుర్కొంటున్నాడు. ఇద్దరి మధ్యా బాక్సాఫీస్ పోరు ఎలా ఉండనుంది అన్నది సస్పెన్స్.

ఇదే తరహాలో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు నేడు రిలీజ్ అయ్యాయి. కిలాడీ అక్షయ్ కుమార్- రానా- రితేష్- బాబి డియోల్- పూజాహెగ్దే- కృతి సనన్- కృతి కర్భందా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హౌస్ ఫుల్ -4 రిలీజ్ అయింది. ఈ చిత్రానికి పోటీగా `సాంద్ కీ అంక్` అనే బయోపిక్ కూడా రిలీజ్ అయింది. ఇందులో తాప్సీ భూమి పెడ్నేకర్ లీడ్ రోల్స్ పోషించారు. హౌస్ ఫుల్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన సినిమాలన్నీ మంచి విజయం సాధించిన నేపథ్యంలో పార్ట్ -4పైనా భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో అక్షయ్ రేసులో నిలుస్తాడని అంచనాలున్నాయి.

ఇక రెండు మూడేళ్లగా బాలీవుడ్ లో బయోపిక్ ల హవా మామూలుగా లేదు. ఉత్తరాది ప్రేక్షకులు జీవిత కథల్ని ఓ రేంజ్ లో ఆదరిస్తున్నారు. సాంద్ కీ అంక్ షార్ప్ షూటర్ చంద్రో థోమర్- ప్రకాషీ థోమర్ జీవిత కథలు ఆధారంగా తెరకెక్కించారు. ప్రకాష్ తోమర్ పాత్రలో తాప్సీ నటించింది. గతంలో తాప్సీ పలు తెలుగు సినిమాల్లో మెప్పించిన నేపథ్యంలో టాలీవుడ్ ఆడియన్స్ ఈ బయోపిక్ పై ఆసక్తిని చూపిస్తున్నారు. మరి బాక్సాఫీస్ బరిలో కిలాడీకి ఏ స్థాయిలో పోటీ ఇస్తుందో చూడాలి.
Please Read Disclaimer