తేజ శేఖర్ కమ్ములలాగా రిటర్న్ అవుతాడా!

0

ఒకప్పుడు మంచి హిట్స్ కొట్టాడు స్టార్ హీరోలతో సినిమాలు చేసేంత స్థాయికి ఎదిగాడు. అయితే కొన్ని ఫ్లాపులు ఎదురయ్యే సరికి వీఎన్ ఆదిత్య బాగ వెనుకబడిపోయాడు. తన కెరీర్ లో చెప్పుకోదగిన సినిమాలను కలిగి ఉన్న ఈ దర్శకుడికి కొంతకాలం విరామం కూడా తప్పలేదు.

విజయాలు లేని వాళ్లను ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోదనే సంగతి చెప్పనక్కర్లేదు. ఆ విషయానికి వీఎన్ ఆదిత్య కూడా మినహాయింపు కాలేకపోయాడు. కొంత కాలం పాటు మీడియాకు వరసగా ఇంటర్వ్యూలు ఇచ్చేంత ఖాళీగా ఉండిపోయాడు ఈ దర్శకుడు.

అయితే ఇప్పుడు మరో సినిమాతో వచ్చాడు ‘వాళ్లిద్దరిమధ్య ‘అనే చిన్నసినిమాతో దాదాపు కొత్త వాళ్లతో వీఎన్ ఆదిత్య వస్తున్నాడు. ఈ రోజుల్లో సినిమాను ఎలాగైనా చేయవచ్చని వెబ్ సీరిస్-షార్ట్ ఫిల్మ్స్ కూడా తీయవచ్చని..అయితే ప్రమోషన్లోనే విజయం దాగుందని అంటున్నాడు ఈ దర్శకుడు!

సినిమా బాగుంటే చాలదు ప్రమోషన్ అవసరం అంటున్నాడు. ఇక తనకు తానే మరో పోలికను పెట్టుకున్నాడు. తేజ శేఖర్ కమ్ములు తన సహచరుల్లాంటి వారని వారు కొన్ని పరాజయాల తర్వాత గ్యాప్ తీసుకుని.. విజయంతో బౌన్స్ బ్యాక్ అయ్యారని వీఎన్ ఆదిత్య గుర్తు చేస్తున్నాడు. తనకూ అలాంటి విజయమే దక్కుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు వీఎన్ ఆదిత్య. చిన్న సినిమాతో ఈ దర్శకుడు పెద్ద విజయాన్ని పొందుతాడా?
Please Read Disclaimer