ఆ పాత్ర రమ్యకృష్ణకు టర్నింగ్ పాయింట్ అవుతుందా..?

0

సౌత్ ఇండియన్ సీనియర్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ. హీరోయిన్ గా తన అందాల తో సినిలోకాన్ని ఒక ఊపు ఊపేసింది. దాదాపుగా సౌత్ ఇండియన్ హీరోలు అందరితోనూ నటించిన ఘనత ఆమె సొంతం. హీరోయిన్ గా చేసినంత కాలం రమ్యకృష్ణ అభిమానులకు ఆరాధ్య దేవతనే చెప్పాలి. అంతగా పాపులారిటీ తెచ్చుకుంది. అందమైన హావభావాలతో అద్భుతమైన నటనతో సినీ అభిమానులను అలరిస్తూనే ఉంది. ఇప్పటికి ప్రేక్షకుల కళ్లముందు మెదులుతుంది అంటే ఆమె చేసిన పాత్రలే అటువంటి గుర్తింపును సంపాదించి పెట్టాయి.

అయితే హీరోయిన్ గా ఆపేసి క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న రమ్యకృష్ణకు సెకండ్ లైఫ్ ఇచ్చింది అంటే బాహుబలి సినిమాలోని శివగామి పాత్రనే. ఒకవిధంగా చెప్పాలంటే బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అన్నంతగా ఆమె కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అయింది ఆ సినిమా. అయితే బాహుబలి తర్వాత చాలా గ్యాప్ తీసుకొని కొన్ని సినిమాలు చేసింది కానీ ఆ రేంజ్ పేరు రాలేదు. రమ్యకృష్ణ తెలుగే కాదు సౌత్ బాషలన్నింటికీ సుపరిచితురాలే. అయితే శివగామి తర్వాత అంతే పవర్ రోల్ లో త్వరలో కనిపించనుందట.

అదేంటంటే రమ్యకృష్ణ ప్రస్తుతం సాయిధరమ్ తేజ్-దేవాకట్టా కాంబినేషన్లో వస్తున్న సినిమాలో పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలిగా కనువిందు చేయనుందట. ఆ పాత్ర అంత పవర్ ఫుల్లా.. అంటే బాహుబలి తర్వాత రమ్యకృష్ణ పోషిస్తున్న పవర్ ఫుల్ రోల్ ఇదేనని చిత్రయూనిట్ చెప్తున్నారు. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతులమీదుగా ప్రారంభమైన ఈ సినిమాను జె.భగవాన్ పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన నివేతా పేతురాజ్ నటిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. మరి నిజంగా ఈ సినిమాలోని రాజకీయ నాయకురాలి పాత్ర రమ్యకృష్ణ కెరీర్ లో కీలకమవుతుందా లేదా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-