వీరభోగను గుర్తు తెస్తున్న మీసం!

0

టాలీవుడ్ లో కంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్ ఎంచుకుంటూ.. తన సినిమాల్లో విభిన్నత చూపిస్తూ ముందుకు సాగుతున్న హీరో శ్రీవిష్ణు. శ్రీవిష్ణు సినిమా అంటే.. డిఫరెంట్ గా ఉంటుంది అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఏర్పడింది. అయితే ఈ డిఫరెంట్ ఫిలిమ్స్ తో వచ్చిన చిక్కేంటంటే ప్రతి చిత్రమూ హిట్ అవుతుందనే గ్యారెంటీ ఉండదు. ఒక్కోసారి పూర్తిగా ఫలితం రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది.

‘మెంటల్ మదిలో’.. ‘నీది నాది ఒకే కథ’.. ‘బ్రోచెవారెవరురా’ సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి కానీ ‘వీరభోగ వసంతరాయలు’ ఇచ్చిన షాక్ మామూలుది కాదు. రివ్యూ రైటర్లకు.. విమర్శకులకే పిచ్చెక్కింది.. ఇక సాధారణ ప్రేక్షకుల పరిస్థితి ఏం చెప్తాం? డిఫరెంట్ కంటెంట్.. కొత్త కాన్సెప్టులు ట్రై చేసినపుడు అలాంటివి కూడా జరుగుతాయి. ‘మెంటల్ మదిలో’.. ‘నీది నాది ఒకే కథ’.. ‘బ్రోచెవారెవరురా’ సినిమాల్లో కాన్సెప్ట్ డిఫరెంట్ అయినా సరదాగా సాగడంతో ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. నిజానికి శ్రీవిష్ణు సినిమాలలో హిట్ అయిన వాటిని పరిశీలిస్తే కామెడీ కామన్ గా ఉంటుంది. ఎంత డిఫరెంట్ కాన్సెప్ట్ అయినా ఎంటర్టైనింగ్ గా సాగినప్పుడే శ్రీవిష్ణుకు హిట్ దక్కింది.

అయితే శ్రీవిష్ణు కొత్త సినిమా ‘తిప్పరా మీసం’ మాత్రం అలా ఫన్ టోన్ లో సాగే సినిమాలా కనిపించడం లేదు. కామెడీ సంగతి పక్కన పెట్టినా ఆ గడ్డం.. శ్రీవిష్ణు వాలకం చూస్తుంటే ‘వీరభోగ.. ‘ను గుర్తుతెచ్చేలా ఉంది. సినిమా ఫ్లాప్ అవుతుందని చెప్పడం కాదు కానీ ‘వీర భోగ వసంతరాయలు’ ప్రోమోస్ రిలీజ్ అయినప్పుడు ఇలాగే ఇంటెన్స్ గా సీరియస్ గా ఉన్నాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత అదంతా ఒక తికమక బేరం అని అర్థం అయింది. ఇప్పుడు ‘తిప్పరా మీసం’ కూడా అలాంటి సీరియస్ డ్రామా లాగే కనిపిస్తోంది. సాధారణ ప్రేక్షకులు ఎంతమాత్రం కనెక్ట్ అవుతారో వేచి చూడాలి. మరోవైపు సినిమాకు మేకర్స్ ఆశించినంతగా బజ్ రావడంలేదని అంటున్నారు. ‘తిప్పరా మీసం’ కథ సరిగా లేకపోతే మాత్రం ఈ సారి బాక్స్ ఆఫీస్ దగ్గర కష్టమేననే టాక్ వినిపిస్తోంది.
Please Read Disclaimer