ఇంతకీ సినిమా 25 న వస్తుందా రాదా?

0

అదో మీడియం రేంజ్ హీరో సినిమా. ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి మల్టిస్టారర్ అనుకోవాలి. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయం పై గత కొన్ని రోజులుగా హీరోకు నిర్మాతకు మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది. హీరోగారేమో సినిమాను ఏప్రిల్ కు వాయిదా వేయాలని పట్టుబడుతున్నాడట. అంతే కాదు బయ్యర్లు కూడా ఈ కరోనాలు గిరోనాల రచ్చ తగ్గిన తర్వాత రిలీజ్ చేస్తే మంచిదని అంటున్నారట. అయితే నిర్మాత గారు మాత్రం అదే డేట్ కు సినిమాను రిలీజ్ చేయాలని పట్టుబట్టుకుని కూర్చున్నాడట.

ఆయన ఏదో సాదాసీదా నిర్మాత అయితే ఈ హీరోగారి మాట చెల్లుబాటయ్యేదేమో కానీ స్టార్ ప్రొడ్యూసర్ కావడంతో ఆయన నిర్ణయమే ఫైనల్. ఆయనంతట ఆయనే మనసు మార్చుకుంటే మాత్రం సినిమా డేట్ మారే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ నిర్మాత ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక భాగస్వామి ఈమధ్య వేరు కుంపటి పెట్టుకున్నాడు. వీరి చేతిలో చాలా థియేటర్లు ఉన్నాయి. ఇప్పుడు విడిపోయారు కాబట్టి థియేటర్ల విషయం లో ఈ నిర్మాతకు ఇబ్బందులు తప్పకపోవచ్చని అంటున్నారు.

మరి ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల అవుతుందా లేదా.. థియేటర్ల విషయంలో ఏం జరుగుతుందో తెలియాలంటే మాత్రం మరో రెండు వారాలు గడవాలి. ఏదేమైనా కరోనాకు అసలు భయపడని నిర్మాత గుండెధైర్యాన్ని ఇండస్ట్రీలో జనాలు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-