మే 15 కు వకీల్ సాబ్ నిజంగానే వస్తారా?

0

కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను ఇబ్బంది పెడుతోంది. న దేశంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. నివారణ చర్యలలో భాగంగా స్కూల్స్ ను… థియేటర్లు… షాపింగ్ మాల్స్ ను మూసివేస్తున్నారు. టాలీవుడ్ విషయానికి వస్తే ఈ నెల 21 వరకూ షూటింగుల ను రద్దు చేయాలని ఫిలిం ఛాంబర్ వారు కోరారు. ఒకవేళ కరోనా వైరస్ కేసులు కనుక తగ్గుముఖం పట్టని పక్షంలో మరి కొంత కాలం షూటింగులు జరిగే అవకాశం లేదు. దీంతో ఇప్పటికే రిలీజ్ డేట్లు ప్రకటించిన సినిమాలు అనుకున్న సమయానికి వస్తాయా రావా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ కూడా వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు.

‘వకీల్ సాబ్’ ను మే 15 న విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ను చాలా టైట్ గా ప్లాన్ చేశారట. దీంతో వారం రోజులు షూటింగు కు ఆటంకం కలిగినా రిలీజ్ డేట్ కు ఇబ్బంది కలిగే అవకాశం ఉందట. ఈ దశలో పవన్ తో అవసరం లేని కొన్ని సీన్లను చిత్రీకరించాలని దర్శకుడు వేణు శ్రీరామ్ ప్లాన్ చేసుకున్నారట. అవి ఇప్పుడు వాయిదా పడ్డాయి. మరో వైపు పవన్ ఉగాది నుంచి షూటింగ్ లో పాల్గొంటారనేది ప్లాన్. అప్పటికి కరోనా కేసులు కంట్రోల్ అయితే ఓకే కానీ లేక పోతే షూటింగ్ కు అంతరాయం తప్పదు.

మే 15 డెడ్లైన్ అందుకోవాలంటే మాత్రం పగలూ రాత్రి తేడా లేకుండా షూటింగ్ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఇతర నటీనటులతో తెరకెక్కించాల్సిన సీన్లను పక్కన పెడితే పవన్ తోనే మరో 10 రోజుల షూట్ ఉందట. మరి దర్శకుడు వేణు శ్రీరామ్ ఏం చేస్తాడో వేచి చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-