రౌడీని పట్టించుకోని ఓవర్సీస్ ప్రేక్షకులు

0

యువహీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ కావడంతో ఈ సినిమాపై యూత్ లో ఆసక్తి వ్యక్తం అయింది కానీ రివ్యూస్.. మౌత్ టాక్ నిరాశాజనకంగా ఉన్నాయి. సినిమా రిలీజ్ కు ముందునుంచే ‘అర్జున్ రెడ్డి’ తో పోలికలు వచ్చినప్పటికీ మేకర్స్ మాత్రం ఆ సినిమాకు ఈ సినిమాకు సంబంధం లేదని అన్నారు. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత ‘అర్జున్ రెడ్డి’ హ్యాంగోవర్ నుంచి విజయ్ బయటకు రాలేదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

ఇక ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కు అమెరికాలో స్పందన నిరాశాజనకంగా ఉంది. సినిమాకు రిలీజ్ కు ముందు పెద్దగా బజ్ లేకపోవడంతో ఓపెనింగ్స్ పై ఆ ప్రభావం కనిపించింది. పబ్లిసిటీ కూడా తక్కువగా ఉండడంతో డిజాస్టర్ ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రీమియర్స్ కు 143 లొకేషన్స్ నుంచి వచ్చిన కలెక్షన్స్ $111K మాత్రమే. మొదటి రోజు కలెక్షన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయని విజయ్ దేవరకొండ క్రేజ్ ఏమాత్రం పని చేయలేదని అంటున్నారు.

సినిమా టీజర్.. ట్రైలర్లలోనే ‘అర్జున్ రెడ్డి’ ఛాయలు కనిపించడంతో సినిమాపై పెద్దగా బజ్ రాలేదు. ఇక ఓవర్సీస్ లో పబ్లిసిటీ సరిగా చేయక పోవడం కూడా సినిమా ఓపెనింగ్స్ పై ప్రభావం చూపించింది. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది కాబట్టి కలెక్షన్స్ మెరుగయ్యే అవకాశాలు తక్కువేనని అంటున్నారు. విజయ్ దేవరకొండ తన ఎంచుకునే సినిమాల విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే భవిష్యత్తు లో ఇంకొన్ని ఎదురుదెబ్బలు తప్పవని అంటున్నారు.
Please Read Disclaimer