కిచెన్ లో ఏం కోస్తున్నావు గురూ!

0

విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో వేడి పెంచుతున్న సంగతి తెలిసిందే. డియర్ కామ్రేడ్ తర్వాత ఒకేసారి రెండు మూడు సినిమాల్నితెరపైకి తెచ్చాడు. అందులో క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కే.ఎస్.రామారావు నిర్మిస్తున్న `వరల్డ్ ఫేమస్ లవర్` ఒకటి. ఈ సినిమాలో కౌశల్య కృష్ణమూర్తి ఫేం ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తోంది.

తాజాగా విజయ్ దేవరకొండతో ఐశ్వర్య రాజేష్ రొమాన్స్ కి సంబంధించిన ఫోటోలు రిలీజయ్యాయి. కిచెన్ లో భార్యామణిని కౌగిలిలో బంధించి మాంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నాడు దేవరకొండ. ఐశ్వర్యా రాజేష్ అతడికి భార్య అయిన తర్వాత సన్నివేశమిది. ఐశ్వర్య ఈ పోస్టర్ లో సగటు గృహిణిలా ఒదిగిపోయి కనిపిస్తోంది. విజయ్ అంతే ఒద్దికగా భార్యను విడిచిపెట్టని బుద్ధిమంతుడైన భర్తలా కనిపిస్తున్నాడు. చాకుతో కిచెన్ లో ఉల్లి పాయలు కోస్తున్నాడా.. ఇంకేం కోస్తున్నాడు! అన్నది ఈ పోస్టర్ చూసి ఎవరైనా చెప్పేయొచ్చు.

అన్నట్టు వరల్డ్ ఫేమస్ లవర్ టైటిల్ కి ఇలా కిచెన్ లో రొమాన్స్ కి సింక్ కనిపించడం లేదు. ఈ సినిమా ఆరెంజ్ తరహాలో ఉంటుందని రౌడీగారు దేశదిమ్మరిలా అన్ని చోట్లా తిరుగుతూ ప్రేమలో పడిపోతుంటారని ఇంతకుముందు ప్రచారమైంది. మరి రౌడీ ప్రేమికుడిని క్రాంతి మాధవ్ ఏ కోణంలో చూపిస్తున్నారు? నిజంగానే ఫేమస్ లవర్ అని ప్రూవ్ చేసేదెలా? అన్నది తెరపై చూసి డిసైడ్ చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఫిబ్రవరి 14న లవర్స్ డే కానుకగా రిలీజవుతోంది.
Please Read Disclaimer