సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

వరల్డ్ ఫేమస్ లవర్ ప్రీరిలీజ్ బిజినెస్

0

విజయ్ దేవరకొండ `వరల్డ్ ఫేమస్ లవర్` ప్రేమికుల రోజు కానుకగా ఈ నెల 14 న (శుక్రవారం) విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ నలుగురు భామలతో రొమాన్స్ చేస్తున్నాడు. ఐశ్వర్య రాజేష్- కేథరిన్ థ్రెసా- రాశీ ఖన్నా- ఇజబెల్లా కథానాయికలుగా నటిస్తున్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించగా కె.ఎస్.రామారావు- వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇదో రైటర్ ఫాంటసీ ప్రేమకథల సమాహారం అని ఇప్పటికే చిత్రబృందం హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇక విజయ్ క్రేజు దృష్ట్యా వరల్డ్ ఫేమస్ లవర్ ప్రీరిలీజ్ బిజినెస్ పెద్ద స్థాయిలోనే పూర్తి చేసింది. దాదాపు 30 కోట్ల మేర ప్రపంచవ్యాప్త థియేట్రికల్ బిజినెస్ సాగించింది. డియర్ కామ్రేడ్ (35కోట్ల బిజినెస్) తరువాత ఇది రౌడీకి రెండవ అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ అనే చెప్పాలి. కేవలం ఆంధ్ర ఏరియాకి 10 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారు.

ఏరియా వారీ బిజినెస్ పరిశీలిస్తే.. నైజాం 9 కోట్లు.. సీడెడ్ 4కోట్లు..(అడ్వాన్స్).. ఆంధ్ర 10 కోట్లు (ఎన్.ఆర్.ఏ) .. ఏపీ- టీఎస్ కలుపుకుని 23 కోట్ల బిజినెస్ చేసింది. రెస్టాఫ్ ఇండియా- 4 కోట్లు.. ఓవర్సీస్ 3.50 కోట్లు బిజినెస్ చేయగా ప్రపంచవ్యాప్తంగా 30.50 కోట్ల మేర బిజినెస్ సాగించింది.
Please Read Disclaimer