చివరి దశ షూటింగ్ లో వరల్డ్ ఫేమస్ లవర్

0

యువ హీరో విజయ్ దేవరకొండ – క్రాంతి మాధవ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. విజయ్ చివరి చిత్రం ‘డియర్ కామ్రేడ్’ నిరాశపరిచినప్పటికీ ఈ కొత్త సినిమాపై యూత్ లో ఆసక్తి మాత్రం వ్యక్తం అవుతోంది. ఈ సినిమాలో విజయ్ పాత్ర గురించి తాజాగా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి.

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది.. ఎప్పుడు విడుదల అవుతుందని ఎదురు చూస్తున్నవారికి శుభవార్త ఏంటంటే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చిందని సమాచారం. ఈ వారంలోనే షూట్ మొత్తం పూర్తవుతుందట. ఇక ఈ సినిమా లో విజయ్ పాత్ర ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని టాక్. ఈ సినిమాలో విజయ్ ఒక రచయిత గా కనిపిస్తాడట. విజయ్ ఒక మంచి బుక్ రాసే ప్రయత్నం లో ఉంటాడని.. ఆ కథలో ఉండే పాత్రలతోనే సినిమా నడుస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో రాశి ఖన్నా.. ఐశ్వర్య రాజేష్.. కాథరిన్ ట్రెసా.. ఇజబెల్ లీట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి ఇంతమంది హీరోయిన్లు అంటే వీరిలో ఎవరు విజయ్ రాసే కథలో పాత్రలో ఎవరు నిజ జీవిత పాత్రలో సినిమా చూస్తే కానీ తెలిసే అవకాశం లేదు.

విజయ్ నటించే ప్రతి సినిమాలోనూ తన ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువ గానే ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా కూడా దాదాపుగా విజయ్ కంట్రోల్ లోనే జరిగిందని.. విజయ్ స్టైల్ లోనే సినిమా సాగుతుందని అంటున్నారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై ఈ సినిమాను కెఎ వల్లభ నిర్మిస్తున్నారు. కె యస్ రామారావు ఈ చిత్రానికి సమర్పకుడి గా వ్యవహరిస్తున్నారు. ‘ఓనమాలు’.. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ లాంటి అభిరుచిగల సినిమాలు తెరకెక్కించిన క్రాంతి మాధవ్ ఈ చిత్రానికి దర్శకుడు.
Please Read Disclaimer