ప్లాప్ మూవీ రీమేక్ ఏంటి బాబూ…!

0

విజయ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ భారీ అంచనాలతో రిలీజై పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. రాశీఖన్నా ఐశ్వర్య రాజేష్ కేథరిన్ మరియు ఇజాబెల్లె హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చగా కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్పై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇదే తన చివరి లవ్ స్టోరీ అని విజయ్ దేవరకొండ ప్రకటించడంతో ‘వరల్డ్ ఫేమస్ లవర్’పై అందరి చూపు పడింది. ‘లవర్స్ డే’ కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సఫీస్ వద్ద బోల్తా కొట్టింది. విజయ దేవరకొండ కెరీర్లో అతి పెద్ద డిసాస్టర్ గా నిలిచిపోయింది. ఈ సినిమా వల్ల సోషల్ మీడియాలో దేవరకొండని తన అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో విమర్శించారు.

అయితే ఈ ప్లాప్ చిత్రానికి సంబంధించిన న్యూస్ ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే బాలీవుడ్ టాప్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ చిత్రాన్ని చూసిన కరణ్ జోహార్ హిందీ ప్రేక్షకులకు ఈ స్టోరీ కనెక్ట్ అవుతుందని రీమేక్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నాడంట. విజయ్ దేవరకొండతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ప్రస్తుతం ఫైటర్ అనే సినిమాతో బాలీవుడ్ లో లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నటి ఛార్మి కోప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. కరణ్ జోహార్ ఇంతకు ముందు దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడు. అయితే ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శన కనబరిచిన కారణంగా తన నిర్ణయాన్ని విరమించుకున్నాడు. ఈ సినిమా హిందీలో డబ్ అయ్యి మంచి ప్రేక్షకాదరణ పొందింది. మరి ఇప్పుడైనా కరణ్ జోహార్ తీసుకున్న నిర్ణయం కార్యరూపం దాల్చుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.
Please Read Disclaimer