వరల్డ్ ఫేమస్ లవర్.. నాలుగు కథల సీక్రెట్!

0

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 న విడుదల కానుంది. సినిమాకు బజ్ ఎలా ఉన్నప్పటికీ యూత్ లో మాత్రం విజయ్ సినిమాకు ఆసక్తి ఎక్కువే. అయితే ఈ సినిమాలో విజయ్ నాలుగు విభిన్నమైన షేడ్స్ లో కనిపిస్తున్నాడు.. నలుగురు హీరోయిన్ల తో రొమాన్స్ చేస్తున్నాడు. టీజర్.. ట్రైలర్ల లో ఈ లవ్ స్టోరీల శాంపిల్స్ చూపించారు. అయితే ఇదంతా ఏంటి అని చాలా మందికి అర్థం కాలేదు.

ఈ సినిమాలో విజయ్ ఒక రచయిత.. వరల్డ్ ఫేమస్ లవర్ ఎలా ఉంటాడు అనే భావనతో కథలు రాయడం మొదలు పెడతాడట. మొత్తం నాలుగు కథలు .. అన్నీ ఒకే సమయంలో జరుగుతాయి. ఆ కథలలో హీరో విజయ్.. హీరోయిన్లు మాత్రం మారతారు. మరి నిజంగా వరల్డ్ ఫేమస్ లవర్ ఎవరు? అనేది ఈ సినిమా లో చివరకు తెలుస్తుంది. ఏదేమైనా ఇలాటి స్టోరీతో సినిమాను తెరకెక్కించడం ఒక విభిన్నప్రయత్నమనే చెప్పాలి. ఎలాంటి పాత్రలో అయినా సహజంగా కనిపిస్తూ ఆ పాత్ర ఒదిగిపోవడం విజయ్ తీరు. అందుకే నాలుగు భిన్నమైన పాత్రలను ఎంతో ఈజ్ తో పోషించాడని అంటున్నారు.

అయితే ఈ స్టోరీలైన్ ఎంతవరకూ ప్రేక్షకులను మెప్పిస్తుంది? ‘అర్జున్ రెడ్డి’ తో మాటిమాటికీ వస్తున్న పోలికలను ఈ సినిమా ఎలా తప్పించుకుంటుంది అనేది వేచి చూడాలి. ఒకటి మాత్రం నిజం. సాధారణంగా వాలెంటైన్స్ డేకి ఒక సినిమాలో ఒక లవ్ స్టోరీని చూసే అవకాశం ఉంటుంది. ఈసారి మాత్రం రౌడీగారి పుణ్యమా అని ఒకే టికెట్టు కు నాలుగు ప్రేమ కథలు.. జాక్ పాట్ అనుకోవాలేమో!
Please Read Disclaimer