వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ టాక్: అర్జున్ రెడ్డి ని గుర్తుకు తెస్తోందే

0

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ సినిమాలో రాశి ఖన్నా.. ఐశ్వర్య రాజేష్.. కేథరిన్ ట్రేసా.. ఇజబెల్ లీట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాసేపటి క్రితం ఈ సినిమా టీజర్ విడుదలైంది.

“ప్రేమంటే ఒక కాంప్రమైజ్ కాదు.. ప్రేమలో ఒక దైవత్వం ఉంటుంది. ప్రేమంటే ఒక శాక్రిఫైజ్. ప్రేమలో దైవత్వం ఉంటుంది. అవేవీ నీకు అర్థం కావు” అంటూ వాయిస్ ఓవర్ వినిపిస్తూ ఉంటే హీరోయిన్ స్నానం చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో విజయ్ దేవరకొండ షర్టు లేకుండా రోడ్ పై నిలుచుని ఇంట్లో ఉన్న రాశిని చూస్తుంటాడు. రాశి కిటికీలోనుంచి చూస్తూ ఉంటుంది. ఈ వాయిస్ ఓవర్ వచ్చే సమయంలోనే కాస్త దిగువ మధ్య తరగతి కుటుంబంలా కనిపించే సెటప్ లో విజయ్.. ఐశ్వర్య రాజేష్.. కనిపిస్తారు. ఐశ్వర్య సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక ఇంటర్ కట్స్ లో గనిలో పని చేసే కార్మికుడిలా.. పైలట్ గా.. బైక్ రేసర్ లాగా.. ఒక లవర్ బాయ్ లాగా విభిన్న గెటప్స్ లో విజయ్ కనిఇస్తాడు. పైలట్ గా పని చేస్తున్న ఇజబెల్ లీట్ తో కలిసి స్కై డైవింగ్ చేస్తుంటాడు. కేథరిన్ ట్రెసా ఒక సీన్ లో గనుల దగ్గర ఒక ధనిక మహిళ తరహాలో కనిపించింది. మధ్యలో ‘అర్జున్ రెడ్డి’ పాత్ర లాగా విజయ్ కొంచెం ఇంటెన్స్ గా.. లవ్ లో ఫెయిల్ అయిన వ్యక్తి లాగా ప్రవరిస్తున్నట్టు కూడా చూపించారు.

టీజర్ చూస్తుంటే హీరో నాలుగు గెటప్పులు.. నలుగురు హీరోయిన్లు.. మధ్యలో అర్జున్ రెడ్డి ఎఫెక్ట్.. వీటన్నిటికి లింక్ ఏంటి అని అనుమానం వస్తుంది. అయితే ఆ లింక్ ఏంటి అనేది మాత్రం టీజర్ లో వెల్లడించలేదు. ఇక ‘ఐ డిడ్ నాట్ జస్ట్ స్ప్రెడ్ యువర్ లెగ్స్ యామిని.. ఐ లవ్డ్ యూ యామిని’ డైలాగ్ మాత్రం సూపర్ సూపర్ బోల్డ్. దాన్ని తర్జుమా చేస్తే బాగుండదు కాబట్టి అలాగే వదిలేద్దాం.

టీజర్ ఆసక్తి రేకెత్తిస్తోంది.. అంతా బాగానే ఉన్నట్టుంది కానీ ఊరికే ‘అర్జున్ రెడ్డి’ ని గుర్తు తీసుకొస్తూ ఉండడం కాస్త చికాకు పెడుతుంది. మరి నిజంగా సినిమాకు అది అవసరమా లేక అలా అయితేనే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని భావించారా అనేది తెలియాలంటే మాత్రం మనం సినిమా రిలీజ్ అయ్యే వరకూ వేచి చూడక తప్పదు. ఎప్పటిలాగే విజయ్ అన్ని గెటప్స్ లో సహజంగా కనిపించాడు. విజువల్స్.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఆలస్యం ఎందుకు చూసేయండి ఈ దేవరకొండ విజయ సాయి గారి వరల్డ్ ఫేమస్ లవర్ ను..!