‘ఫేమస్ లవర్’ టీజర్ ఎప్పుడంటే?

0

రౌడీస్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కె.ఎస్ రామారావు నిర్మాతగా వరల్డ్ ఫేమస్ లవర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే `అర్జున్ రెడ్డి`- `గీత గోవిందం` చిత్రాలతో లవర్ బోయ్ ఇమేజ్ ని సొంత చేసుకున్న రౌడీ స్టార్ ఈ సినిమాతో మరింతగా గాళ్స్ లో క్రేజ్ ని సొంతం చేసుకుంటాడనే అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు ఆ తరహా బజ్ ని తీసుకొచ్చాయి. తాజాగా యూనిట్ టీజర్ రిలీజ్ తేదీ ని నిర్ణయించింది. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 3న టీజర్ రిలీజ్ చేస్తున్నామని ప్రకటించింది. ఈ టీజర్ తో ఫేమస్ లవర్ సంగతేంటో తెలిసే అవకాశం ఉంది.

లవ్ స్టోరీని సెన్సిబుల్ గా ట్రీట్ చేయడం క్రాంతి మాధవ్ కు కొట్టిన పిండి. అయితే ఈసారి ఆ పంథాకు కాస్త కమర్శియాల్టీని అద్ది తెరకెక్కిస్తోన్న చిత్రమిది. విజయ్ కు అన్ని వర్గాల్లో ఉన్న పాలోయింగ్ ను దృష్టిలో పెట్టుకుని తనదైన సెన్సిబిలిటీ మిస్ అవ్వకుండా తన పరిదిని దాటి డిఫరెంట్ జానర్ లో తెరకెక్కిస్తున్నాడు. టైటిల్ అనౌన్స్ మెంట్ తోనే రౌడీ బోయ్ కి సెట్ అయ్యే స్టోరీ ఇదని అభిమానుల్లో చర్చ సాగింది. అటుపైనా ప్రచార చిత్రాలు.. పోస్టర్లు క్యూరియాసిటీ ని పెంచాయి. ఇక టీజర్.. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఫేమస్ లవర్ చిత్రీకరణ తుది దశ కు చేరుకుంది.

ఇందులో విజయ్ తో ముగ్గరు భామలు రొమాన్స్ చేస్తున్నారు. రాశీఖన్నా- క్యాథరీన్ థ్రెసా- ఇజిబెల్లా లొయెట్టీ తో విజయ్ రొమాంటిక్ సీన్స్ రచ్చేనని వినిపిస్తోంది. హీరోయిన్లకు సంబంధించి డబ్బింగ్ కూడా పూర్తయినట్లు సమాచారం. ఈ సినిమాపై రౌడీ స్టార్ గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడు. గత సినిమా డియర్ కామ్రేడ్ భారీ అంచనాల నడుమ రిలీజై బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఈ సినిమా తో సక్సెస్ సాధించి సత్తా చాటాలని చూస్తున్నాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న సినిమా రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు.
Please Read Disclaimer