ఫేమస్ లవర్ కు పోటీగా తమిళ సర్వర్!

0

యువ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకూ భారీ బజ్ అయితే ఏర్పడలేదు కానీ యూత్ లో విజయ్ ఫాలోయింగ్ తో ఈ సినిమా గట్టెక్కే అవకాశాలను ఎవరూ తోసిపుచ్చలేరు. ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన సమయంలో సోలో రిలీజే కానీ ఇప్పడు మాత్రం పోటీకి మరో సినిమా తగుదుతనమ్మా అంటూ తయారైంది.

తమిళ హాస్య నటుడు సంతానం ఈమధ్య హీరోగా మారాడు. ఆయన నటించిన చిత్రం ‘సర్వర్ సుందరం’. ఈ సినిమాకు దర్శకుడు ఆనంద్ బాల్కి. ఈ సినిమాలో సంతానం ఒక ఫైవ్ స్టార్ హోటల్ సర్వర్ గా నటిస్తున్నాడు. అందుకోసం చాలా నెలలు ట్రెయినింగ్ కూడా తీసుకున్నాడట. ఇక సినిమాలో మరో స్పెషాలిటి ఏంటంటే మునుపటి తరం కమెడియన్ నగేష్ మనుమడు బిజేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను తమిళంతో పాటుగా తెలుగులో కూడా ఫిబ్రవరి 14 న రిలీజ్ చేస్తున్నారు.

దీంతో సోలోగా బాక్స్ ఆఫీసును దున్నుకుందామని అనుకున్న వరల్డ్ ఫేమస్ లవర్ కు తమిళ సర్వర్ అడ్డుపడుతున్నట్టే. అయితే సంతానం సినిమా విజయ్ సినిమాకు ఎంతమేరకు పోటీ ఇవ్వగలదు.. ప్రేక్షకులు నిజంగా పట్టించుకుంటారా అనేది మాత్రం లవర్స్ డే రోజే తెలుస్తుంది.
Please Read Disclaimer