మూడు నెలల్లో మార్పు చూస్తారంటున్న రౌడీ

0

యువ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14 న విడుదల కానుంది. సినిమాపై బజ్ కాస్త తక్కువే ఉంది కానీ విజయ్ క్రేజ్ తో బుకింగ్స్ లో జోరు కనిపిస్తోంది. ఇక విజయ్ కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై క్రేజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నాడు.

ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో “మీరు ప్రేమకథలను ఇకపై చెయ్యనని చెప్పారు. కారణం ఏంటి?” అని అడిగితే “వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత నా ఆలోచనలు మారాయి. ఎప్పుడూ ఒకేరంగా ఉండడం నాకు నచ్చదు. నా జీవితంలో మార్పు ఉండాలని కోరుకుంటాను. నా డ్రెస్సింగ్ స్టైల్ లో కూడా మీరు గమనించే ఉంటారు. ఇది కూడా అలాంటిదే” అన్నాడు. మరి మీ కెరీర్ లో నెక్స్ట్ ఫేజ్ ఎలా ఉండబోతోంది.. అని ప్రశ్నిస్తే “చాలా మార్పులు ఉండబోతున్నాయి. మరో మూడు నెలల్లో మీరు ఆ మార్పులు చూస్తారు. ప్రస్తుతానికి అయితే నాకు ఇండియాను రూల్ చేస్తున్నట్టుగా ఉంది” అన్నాడు. మరి విజయ్ చెప్పినట్టుగా ఆ మార్పులేవో తెలియాలంటే మనం మూడు నెలలు వేచి చూడాల్సిందే.

విజయ్ తన తదుపరి చిత్రాన్ని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో చేస్తున్నాడు. ప్యాన్ ఇండియా స్థాయి లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం విజయ్ ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్ లో ట్రెయినింగ్ తీసుకుంటున్నాడు. ఈ సినిమా తన కెరీర్లో తీసుకురాబోయే మార్పుల గురించే విజయ్ మాట్లాడుతున్నాడేమో.
Please Read Disclaimer