బూట్ల తో పాప బోల్డు పోజు

0

ముంబై భామ యామి గౌతమ్ తెలుగు కదా.. ‘నువ్విలా’.. ‘గౌరవం’.. ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ లాంటి తెలుగు సినిమాల్లో నటించింది. అయితే యామి నటించిన సినిమాలు నిరాశపరచడంతో టాలీవుడ్ లో క్రేజ్ రాలేదు. దీంతో బాలీవుడ్ పై ఫోకస్ చేసి కొన్ని సినిమాల్లో నటించింది. ఈమధ్య ‘ఉరి:ది సర్జికల్ స్ట్రైక్’.. ‘బాలా’ లాంటి హిట్ సినిమాల్లో నటించింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటోలు పోస్ట్ చెయ్యడం తో యామి ఎవరికీ తీసిపోదు.

కొత్త ఏడాదిలో కూడా ఆ హాట్ ట్రెండ్ ను కొనసాగిస్తూ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటో కు “మంచి బూట్లు మిమ్మల్ని మంచి ప్రదేశాలకు తీసుకెళ్తాయి. #హలో2020” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. క్యాప్షన్ కు తగ్గట్టే మోకాళ్లకు పైవరకూ ఉన్న బూట్లు ధరించి ఒక ఫసాక్ పోజిచ్చింది. బూట్లు మంచి ప్రదేశాలకు తీసుకు పోతాయేమో కానీ ఇన్స్టాగ్రామ్ లో లైక్స్.. కామెంట్లు తీసుకు రాలేవు. అవి కావాలంటే మాత్రం హాట్ నెస్ ను రంగరించాల్సిందే. అందుకే సూట్ లాంటి డ్రెస్ కు బటన్స్ పెట్టుకోకుండా అందాలను వడ్డించింది. మొహం పై పడుతున్న జుట్టు తో ఒక సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది.

ఈ ఫోటోకు మంచి స్పందనే దక్కింది. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ఒక లైక్ వేసుకున్నాడు. ఇక సాధారణ నెటిజన్లు కూడా తమ కళాత్మకత.. కళా పోషకత్వం పెద్దగా ప్రకటించకుండానే రొటీన్ కామెంట్లు చేశారు. “ఆసమ్ బూట్ క్యాప్షన్”.. “నా బూట్లు నన్ను ఎక్కడికీ తీసుకుపోవే”.. కిల్లర్ లుక్స్”.. “నలుపు బూట్లలో సెక్సీ లేడీ” అంటూ కామెంట్లు పెట్టారు. ఇక యామి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ‘జిన్నీ వెడ్స్ సన్నీ’ అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది.
Please Read Disclaimer