పటాని టైపు డ్రెస్సులో యామిని!

0

యామిని భాస్కర్ తెలుసు కదా? ఇప్పటి వరకూ యామిని నటించిన సినిమాల లిస్టు చూస్తే ‘కొత్తగా మా ప్రయాణం’.. ‘భలే మంచి చౌక బేరం’ లాంటివి ఉన్నాయి. ఇవి కాకుండా ‘రభస’ లో కూడా నటించింది. వీటిలో మీరు ఏ సినిమానైనా చూసి ఉంటే యామిని పరిచయం ఉండే ఉంటుంది. అయితే యామిని కెరీర్లో ఇంకా హిట్ దక్కలేదు. అందుకే పెద్దగా క్రేజ్ కూడా రాలేదు. అలా అని ఊరుకుంటే ఎలా? అందుకే హాట్ ఫోటో షూట్లతో రచ్చను షురూ చేసింది. యామినికి గ్లామర్ విషయంలో మొహమాటాలు తక్కువే.. అందుకే ఫోటోలు కాస్త హాటుగానే ఉంటాయి.

రీసెంట్ గా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి “ప్రకృతి చిరునవ్వులే రంగులు” అంటూ ఒక ఫసాక్ క్యాప్షన్ ఇచ్చింది. బ్యూటీ అనగానే పెద్దగా మేథస్సు ఉండదని.. మగవారికే అది ఉంటుందని.. అందులోనూ లాల్చీలు ధరించి.. గడ్డాలు గుబురుగా పెంచి చే గువేరా.. మార్క్స్.. లెనిన్ పేర్లు చెప్తేనే మేథావులు అనే ఒక అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ ఇలా ప్రకృతిలోని చిరునవ్వులు గుర్తించడానికి ఎంత గొప్ప హృదయం.. మేథస్సు అవసరమో చెప్పండి? ఫోటో విషయానికి వస్తే ఒక వింత డ్రెస్ ధరించింది.. ఒక పూల డిజైన్ ఉన్న కలర్ఫుల్ లెహెంగా .. పైనేమో టాపో ఇన్నర్ వేరో అర్థం కాని ఒక దిశా పటాని బీరువాలలో మాత్రమే ఉండే వస్త్రం ధరించింది. నడుము మీద చెయ్యి వేసుకొని మరో చేత్తో శిరోజాలను సవరించుకుంటూ ఆకాశంలోకి చూస్తుంది. పాప అందంగానే ఉంది కానీ డ్రెస్ మాత్రం కొంచెం తేడాగానే ఉంది.

ఈ ఫోటోకు నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. “టాప్ ఎక్కడ యామిని?”.. “నీకు చలి లేదా?”..”ఏంది అమ్మాయి ఈ అందం.. ఊపిరి పీల్చుకునేది ఎట్లా??” ఇలా రెచ్చిపోయారు. ఈ కామెంట్లు అన్నీ బాగానే ఉన్నాయి కానీ వీటితో యామినికి ఏమీ ఉపయోగం ఉండదు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు. అలా కాకుండా ఎవరైనా టాలీవుడ్ ఫిలిం మేకర్ ఈ ఫోటోలు చూస్తేనే యామిని హాటు వ్రతానికి తగ్గ ఫలితం దక్కేది!
Please Read Disclaimer