#KGF2: రెండు భల్లూకాలు ఢీ కొట్టినట్టుగా!

0

2020 పాన్ ఇండియా మూవీ `కేజీఎఫ్: చాప్టర్-2` ఈ సమ్మర్ బరిలో రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ చాప్టర్ 1 సంచలన విజయం నేపథ్యంలో సీక్వెల్ భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది. తొలి భాగాన్ని మించిన రెట్టింపు బడ్జెట్ తో హోంబలే ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సమ్మర్ రిలీజ్ అంటూ ప్రకటించారు కాబట్టి .. రిలీజ్ తేదీ ఎప్పుడు దగ్గరపడుతుందా? అన్న ఆత్రం అభిమానుల్లో కనిపిస్తోంది.

దర్శకధీరుడు తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ వాయిదా పడిన నేపథ్యంలో అదే తేదీకే(జూలై 30) కేజీఎఫ్ 2 రిలీజ్ కానుందన్న ప్రచారం సాగుతోంది. ఇందులో కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఇంతకుముందు అధీరా (దత్) లుక్ కి అద్భుత స్పందన వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. కేజీఎఫ్ 2 పతాక సన్నివేశాలు భారీ యాక్షన్ తో ఆద్యంతం రక్తి కట్టిస్తాయని చెబుతున్నారు.

రాకింగ్ స్టార్ యశ్ .. సంజయ్ దత్ మధ్య భీకర పోరాటం గగుర్పొడిచేంత ఎమోషన్ తో తెరకెక్కిస్తున్నారట. ఆ ఇద్దరూ 6 ప్యాక్ లుక్ లో అదరగొట్టబోతున్నారని.. త్వరలోనే క్లైమాక్స్ ఎపిసోడ్ ని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం రాకీ భాయ్ వర్సెస్ అధీరా యాక్షన్ ఎపిసోడ్స్ పై దర్శకుడు పక్కాగా కసరత్తు చేస్తున్నారట. ఈ సినిమాని తెలుగు-కన్నడం- హిందీ-తమిళం- మలయాళంలో అత్యంత భారీగా రిలీజ్ చేయనున్నారు.




Please Read Disclaimer