అచ్చం పవన్ నే గుర్తు చేస్తున్న రాకీ బాయ్

0

అభిమానుల విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత ప్రేమ చూపిస్తాడో చెప్పాల్సిన పనిలేదు. అందులో నిజాయితీ ఉంటుంది. అందుకే అభిమానులు ఆయన్ని దేవుడితో సమానంగా ఆరాధిస్తారు. అభిమానుల కష్టాల్లో ఆదుకున్న మంచితనం పవన్ లో ఎన్నోసార్లు బయటపడింది. ఇక ఫోటోలు కోసం ఎగబడే అభిమానుల్ని చీదరించుకోవడం ఆయనకు తెలీదు. తనని కలిసేందుకు విచ్చేసిన ఫ్యాన్స్ ని ఆప్యాయంగా దగ్గరకు పిలిచి మరీ ఫోటోలకు ఛాన్స్ ఇస్తారు. పవన్ వ్యక్తిగత బౌన్సర్లు అభిమానుల రెక్కలు పట్టుకుని ఈడ్చేస్తుంటే పవన్ సీరియస్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి ఘటనలో ఓసారి ఏకంగా తన పర్సనల్ పీఆర్ ఓ పైనే ఎంతో సీరియస్ అయ్యారు.

అయితే కన్నడలోనూ పవన్ అంత మంచి మనసున్న స్టార్ గా రాకీభాయ్ అలియాస్ యశ్ పేరు తెచ్చుకుంటున్నారు. అభిమానుల పట్ల ఆయనా పవన్ లానే వ్యవరిస్తారు. కేజీఎఫ్ విజయంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగేసిన యశ్ ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్-2 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ పబ్లిక్ ఈవెంట్ కు వెళ్లిన యశ్ అభిమానులపై కురిపించిన ప్రేమ చూడగానే.. పవన్ ని గుర్తుచేసింది. యశ్ ని చూడటానికి..అతనితో ఫోటోలు దిగడం కోసం పెద్ద ఎత్తున అక్కడకు అభిమానులు చేరుకున్నారు. యశ్ కి పూలమాలతో సత్కరించిన అనంతరం పలువురు అభిమానులు ఫోటోలు దిగడానికి పోటీపడ్డారు.

ఈ క్రమంలోనే తోపులాటలో ఒకరిపై ఒకరు పడ్డారు. దీంతో యశ్ సిబ్బంది వాళ్లని పక్కకు తొలగించే క్రమంలో నెట్టేసారు. యశ్ స్పందించి నెమ్మదిగా క్లియర్ చేయమని చెప్పాడు. మరో అభిమాని సెల్ఫీ కోసం పోటీ పడుతుంటే అతన్ని దగ్గరకు పిలిచి సెల్ఫీ ఇచ్చాడు. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతమంది జన సమూహంలో యశ్ అభిమానుల పట్ల వ్యవహరించిన తీరు నెటిజనులను ఆకట్టుకుంటోంది. మీ ప్రేమకి సలాం రాకీ భాయ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లతో యశ్ పై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
Please Read Disclaimer