లైవ్ లోనే లిప్ లాక్..!

0

బిగ్ బాస్ లో పాల్గొన్నవారికి గుర్తింపు పెరగడం సాధారణ విషయమే. కొందరి కెరీర్లకైతే బిగ్ బాస్ బిగ్ బూస్ట్ ఇచ్చింది. తెలుగు బిగ్ బాస్ లో పాల్గొన్నవారికి పెద్దగా లాభం చేకూరలేదు కానీ హిందీ.. తమిళ బిగ్ బాస్ లో పాల్గొన్నవారు చాలామంది సెలబ్రిటీలుగా మారిపోయారు. తమిళ బిగ్ బాస్ 2 కంటెస్టెంట్లు యషిక ఆనంద్.. ఐశ్వర్య దత్తా ఇద్దరూ బిగ్ బాస్ కు ముందు సినిమాలలో నటించారు కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్ బాస్ వీరికి భారీ గుర్తింపు తెచ్చిపెట్టింది.

యషిక.. ఐశ్వర్య ఇద్దరికి బిగ్ బాస్ లో పాల్గొనకముందు పెద్దగా పరిచయం లేదు. హౌస్ లో ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది. బిగ్ బాస్ ముగిసిన తర్వాత కూడా వీరి స్నేహం ఇంకా కొనసాగుతోంది. ఇద్దరూ కలిసి షికార్లు చేస్తూ హోటల్స్ కు.. పార్టీలకు కలిసి వెళ్తూ బెస్ట్ ఫ్రెండ్స్ అనిపించుకుంటున్నారు. రీసెంట్ గా ఇద్దరూ సోషల్ మీడియాలో అభిమానులతో లైవ్ చాట్ చేశారు. మా ఇద్దరి ఫ్రెండ్ షిప్ కు ఇది ఫస్ట్ యానివర్సరీ అని ఒకరి మీద ఒకరు ప్రేమను అభిమానాన్ని కురిపించుకున్నారు.

అయితే ఈ లైవ్ చాట్ ను ముగిస్తూ ‘లవ్ యూ ఆల్’ అని చెప్పే సమయంలో వీరితో పాటుగా ఉన్న మరో బాయ్ ఫ్రెండ్ సడెన్ గా యషిక పెదవులపై గట్టిగా లిప్ లాక్ చేశాడు. సడెన్ గా జరిగినది కావడంతో ఆ లిప్పు లాకు లైవ్ వీడియో చాలామందికి దర్శనమైంది. ఈ సంఘటన ఓ నెల రోజుల క్రితమే జరిగినా వీడియో మాత్రం ఇప్పుడు వైరల్ అయింది. అయినా యషిక మొదటి నుంచి బోల్డ్ భామే. గౌతం కార్తీక్ హీరోగా నటించిన ‘ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు’ అనే అడల్ట్ సినిమాతో పరిచయం అయింది. బిగ్ బాస్ లో కూడా మరో కంటెస్టెంట్ తో లిప్ లాక్ చేసింది. అయితే అవన్నీ ఒక ఎత్తు.. ఇది ఒక ఎత్తు అన్నట్టుగా ఈ వీడియో వైరల్ అయింది. మీరు ఒక లుక్కేయండి. మీరు అడల్ట్ కాకపోతే చూడకండి. రూల్స్ పాటించండి!
Please Read Disclaimer