యాత్ర దర్శకుడికి క్రేజీ ఆఫర్ ?

0

స్వర్గీయ జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపధ్యాన్ని తీసుకుని రూపొందించిన యాత్ర సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు మహి రాఘవ కొత్త ప్రాజెక్ట్ గురించి ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం లేదు. అయితే భారీ నిర్మాణ సంస్థ పివిపి నుంచి ఒక ఆఫర్ ఇచ్చిందని కథ నచ్చడంతో స్క్రిప్ట్ పనిలో మహి రాఘవ్ బిజీగా ఉన్నాడని వినికిడి. అయితే ఇది చిన్న బడ్జెట్ సినిమా కాదట. పాన్ ఇండియా లెవెల్ లో మల్టీ లాంగ్వేజ్ తో సరికొత్త కాన్సెప్ట్ తో ఉంటుందట.

చిన్న హీరో అయితే మార్కెట్ పరంగా వర్క్ అవుట్ కాదు కాబట్టి స్టార్ నే ఇస్తామని పివిపి సంస్థ హామీ ఇచ్చినట్టుగా తెలిసింది. అయితే ఆ స్టార్ హీరో ఎవరో ఈ కథకు సూటయ్యే అతన్ని ఏ భాషలో నుంచి తీసుకుంటారో ఇంకా తెలియదు. మొత్తం ఫైనల్ అయ్యాక అఫీషియల్ గా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. నిజానికి ఎపి సిఎం జగన్ కథను ఆధారంగా చేసుకుని యాత్ర 2 తీయాలని ఉందని మహి ఓసారి అన్నాడు.

అయితే ఇప్పుడు ఎన్నికలు అయిపోయి కొత్త ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఇలాంటి పొలిటికల్ మూవీస్ అంతగా వర్క్ అవుట్ కావనే ఉద్దేశంతో ఆ ఆలోచనను వాయిదా వేసుకున్నట్టు తెలిసింది. బహుశా మళ్ళి ఎన్నికల టైంలో ఉండే ఛాన్స్ లేకపోలేదు. ఆనందో బ్రహ్మతో హారర్ జానర్ ని యాత్రతో పొలిటికల్ థీమ్ ని ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా మెప్పించిన మహి రాఘవ ఈసారి ఎలాంటి కథను రెడీ చేసుకున్నారోPlease Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home