హీరోయిన్, కో-డైరెక్టర్ రాత్రికి మందేసి ఏవేవో చేసుకున్నారు: హీరో ఆవేదన

0

‘ఏడు చేపల కథ’ సినిమాతో టెంప్ట్ రవిగా ప్రేక్షకులకు దగ్గరైన హీరో అభిషేక్ రెడ్డి. ఈ సినిమా విడుదలకు ముందు అభిషేక్ పలు ప్రెస్‌ మీట్‌లలో చాలా కబుర్లే చెప్పారు. సినిమా ట్రైలర్ కూడా అదిరిపోవడంతో జనం ఎగేసుకుని థియేటర్లకు వెళ్లారు. కానీ, సినిమాలో వాళ్లు అనుకున్న కంటెంట్ ఏమీ చూపించక పోవడంతో అభిషేక్ రెడ్డితో పాటు డైరెక్టర్‌ని బూతులు తిట్టారు. వాళ్లందరికీ అభిషేక్ రెడ్డి తాజాగా క్షమాపణలు చెప్పారు.

‘వైఫ్, ఐ’ సినిమాతో..

‘ఏడు చేపల కథ’తో నిరాశపరిచిన అభిషేక్ రెడ్డి ఇప్పుడు ‘వైఫ్,ఐ’ అనే కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సాక్షి నిదియా హీరోయిన్. ‘ఏడు చేప‌ల క‌థ’ చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన జి.చ‌రితారెడ్డి నిర్మాతగా ల‌క్ష్మి చ‌రిత ఆర్ట్స్, జిఎస్ఎస్‌పికె స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో జి.ఎస్‌.ఎస్‌.పి. క‌ళ్యాణ్ ద‌ర్శకుడిగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘‘నైఫ్ బెట‌ర్ దెన్ వైఫ్’’ అనేది ఈ చిత్ర టైటిల్‌కు క్యాప్షన్. ఇటీవలే ట్రైలర్ కూడా విడులైంది.

రోజూ రాత్రి 9 తరవాత..

‘వైఫ్,ఐ’ చిత్ర ప్రచారంలో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో ఎప్పటిలానే హీరో అభిషేక్ రెడ్డి రెచ్చిపోయి మాట్లాడారు. అస్సలు మొహమాటం లేకుండా అన్నీ బయటపెట్టేశారు. ముఖ్యంగా కో-డైరెక్టర్ వేణు గురించి మాట్లాడుతూ.. ‘‘మా యూనిట్‌లో హిందీ, ఇంగ్లిష్ బాగా మాట్లాడగలిగినోడు ఇతనొక్కడే. ముంబై నుంచి వచ్చే అమ్మాయిల్ని బాగా మ్యానేజ్ చేస్తాడు. రోజూ రాత్రి 9 తరవాత హీరోయిన్, ఇతను కలిసి రూంలోకి వెళ్లిపోయి వోడ్కా వేసేస్తారు. హీరోకి ఏమీ లేదు బొక్క. అతనిలో గొప్పతనం ఏంటంటే రాత్రి హీరోయిన్‌తో ఎంత వరకు మందేసినా పొద్దున్నే ఆరు గంటలకు ఫస్ట్ షాట్ అంటే వచ్చి రెడీ సార్ అంటాడు. రాత్రి రూంలో హీరోయిన్, కో-డైరెక్టర్ ఏం చేసుకున్నారో మనకి అనవసరం’’ అని మొత్తం బయటపెట్టేశారు.

సిగరెట్లు తాగేసొచ్చి లిప్‌లాకు

కో-డైరెక్టర్ రాత్రంతా హీరోయిన్‌తో మందేసి పొద్దున్నే వచ్చి గురువు గారు రెడీ లిప్ లాక్ అంటాడని అభిషేక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘అది సిగరెట్లు తాగేసి వస్తుంది. నాకేమో సిగరెట్ అలవాటు లేదు. దానితో లిప్ లాక్ చేయాలి. నా బాధ ఎవడికి చెప్పుకోవాలి. నన్నేదో టెంప్టింగ్ స్టార్ తొక్క తోలు అంటున్నారు. ఏమీ లేదు. నన్ను డ్రాయర్ మీద నిలబెట్టి వీళ్లు డబ్బులు చేసుకుంటున్నారు. అది మందుకొట్టి, సిగరెట్ తాగొస్తే దానితో నేనేం రొమాన్స్ చేస్తా. కంపుదొబ్బుతుంది. ఏం ఫీలొస్తుంది. రాత్రి 2 గంటలకు డ్రాయిర్ విప్పి స్విమ్మింగ్ పూల్‌లో దించితే ఏం చేయాలి. చలికి గజగజ వణికిపోవడం తప్ప’’ అంటూ తన అనుభవాలను అభిషేక్ చెప్పుకొచ్చారు.

దొండకాయలు, బెండకాయలు పండించుకుంటాడు

‘వైఫ్,ఐ’ దర్శకుడు కళ్యాణ్ గురించి కూడా చాలా ఆసక్తికరంగా మాట్లాడారు అభిషేక్. ‘‘ఇతను అంత తెలివైన దర్శకుడేం కాదు. అందరికీ అర్థమయ్యే సినిమానే తీస్తాడు. ఈయనలో గొప్ప విషయం ఏంటంటే.. కథ రాస్తాడు, మాటలు రాస్తాడు, ఎడిటింగ్ చేస్తాడు, డీఏ చేస్తాడు, కెమెరా హ్యాండిల్ చేస్తాడు, ఫోకస్ చేస్తాడు, పోస్టర్లు డిజైన్ చేస్తాడు.. మల్టీ టాలెంటెడ్. ఇంత టాలెంట్ ఉన్న వ్యక్తితో సినిమా చేయాలని మూడు సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నా. ఈయన ఇక్కడే లింగంపల్లిలో దొండకాయలు, బెండకాయలు పండించుకుంటూ ఉంటాడు. ఎవ్వరితో కలవడు. అదో టైప్ మెంటాలిటీ. కానీ, ఫైనల్‌గా ఈ సినిమా కుదిరింది’’ అని వెల్లడించారు.

ఎవ్వరూ నిరాశ పడరు

‘ఏడు చేపల కథ’ మాదిరిగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు నిరాశపడరని అభిషేక్ రెడ్డి హామీ ఇచ్చారు. రెండు గంటల పాటు ఫుల్లుగా నవ్విస్తుందని అన్నారు. అలాగే, రొమాన్స్‌కు కూడా ఎలాంటి లోటు లేదని, ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయిందని చెప్పారు. రొమాన్స్‌తో పాటు ఔట్ అంట్ ఔట్ ఫన్ ఉంటుందన్నారు. మహేష్ విట్ట, సూర్య ఆకొండి అద్భుతంగా చేశారని చెప్పారు. జనవరి 1న ‘వైఫ్,ఐ’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని వెల్లడించారు.
Please Read Disclaimer