ఎల్లో ఎల్లో వెరీ బ్యూటిఫుల్లో

0

టాలీవుడ్ లో ఫుల్ గా క్రేజ్ ఉన్న బ్యూటీ ఎవరు అంటే పూజ హెగ్డే పేరు చెప్పాల్సి వస్తుంది. పూజ ఖాతాలో ఒక్కటంటే ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ లేకపోయినా ఈ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకోవడం చాలామందిని అశ్చర్యపరుస్తోంది. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా నటిస్తూ మన తెలుగు స్టార్ల తరహాలో ప్యాన్ ఇండియా మార్కెట్ ను కవర్ చేస్తూ ఉంది!

పూజ నటించిన బాలీవుడ్ చిత్రం ‘హౌస్ ఫుల్ 4’ అక్టోబర్ 25 న రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. పూజ కూడా ఎంతో ఉత్సాహంగా ప్రమోషన్స్ లో పాల్గొంటూ హిందీ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తోంది. సాధారణంగానే పూజ గ్లామర్ పీక్స్ లో ఉంటుంది. కత్తిలాంటి డ్రెస్సులు ధరించి జనాలను కాల్చుకుతింటుంది. ఇక హిందీ సినిమా ప్రమోషన్స్ అనగానే ఆ డోస్ ను మరింతగా పెంచింది. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసి ‘దీపావళి స్పెషల్ హౌస్ ఫుల్ 4 ప్రమోషన్స్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలలో నిమ్మపండు రంగులో ఉన్న ఛోళి.. లెహెంగా ధరించి వయ్యారంగా పోజులిచ్చింది. సూపర్ గా మ్యాచ్ అయ్యే హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ ధరించింది. పూజ హెయిర్ స్టైల్ కూడా సూపర్ గా ఉంది. ఎక్స్ ప్రెషన్స్ కూడా అదిరిపోయాయి. అయితే ఈ డ్రెస్ లో హైలైట్ మాత్రం అందరికీ తెలిసిందే. అది మళ్ళీ మళ్ళీ చెప్పడం అంటే నెటిజన్ల కళాపోషణను తక్కువ చేసినట్టే.

ఈ ఫోటోలకు ఎన్నో కామెంట్లతో నెటిజన్లు తమ జేజేలు తెలిపారు. “బ్యూటీ క్వీన్”.. “హౌస్ ఫుల్ లో అందాలు ఫుల్”.. “ట్రెడిషనల్.. టూ హాట్”.. “ప్లీజ్ పూజా అలా చంపకు” అంటూ కొందరు తమ స్పందనలు తెలిపారు. ఈ ఫోటోలకు దాదాపు నాలుగు లక్షల లైక్స్ వచ్చాయి. ఇక పూజ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే తెలుగులో అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’.. ప్రభాస్ ‘జాన్’ సినిమాల్లో నటిస్తోంది.
Please Read Disclaimer