రంగస్థలం నుండి మరో ప్రోమో సాంగ్

0మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం ఈ నెల 30 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెల్సిందే. విడుదల తేదీ దగ్గర పడుతుండడం తో చిత్ర యూనిట్ ప్రమోషన్లను స్పీడ్ చేసారు. ఇటీవలే భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుకను జరిపి చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసి ఆకట్టుకోగా , రెండు రోజుల క్రితం ‘రంగ రంగ రంగస్థలాన’ ప్రోమో సాంగ్ ను రిలీజ్ చేసారు. ఈ సాంగ్ లో రామ్ చరణ్ డాన్స్ అదరగొట్టాడని టీజర్ చూస్తే అర్ధం అవుతుంది. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ లో సాగిన ఈ సాంగ్ డాన్స్ ప్రియులకు బాగా ఆకట్టుకుంది.

ఇక తాజాగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు సినిమాలోని ‘ఎంత సక్కగున్నావే’ అనే ప్రోమో సాంగ్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. వాస్తవానికి సినిమా ప్రమోషన్ లలో మొదటగా రిలీజ్ చేసిన సింగిల్ ట్రాక్ ఇది..ఈ ఒక్క సింగిల్ ట్రాక్ తో సినిమాకు ఎంత హైప్ రావాలో అంత వచ్చింది. ఇప్పుడు వీడియో కూడా రిలీజ్ చేస్తే ఇక సినిమా అంచనాలు మరింత పెరగడం ఖాయమని మెగా అభిమానులు అంటున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించగా ఆది పినిశెట్టి, జగపతిబాబు, అనసూయలు పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేవిశ్రీ సంగీతం అందించిన ఈ చిత్రంలో పూజ హెగ్డే ఒక ప్రత్యేక గీతంలో అలరించనుంది.