90 ML పాట.. ఇనిపించుకోరు మరి!

0

RX100′ ఫేమ్ కార్తికేయ ప్రస్తుతం ’90ML’ అనే విభిన్న చిత్రంలో నటిస్తున్నాడు. ‘ఆథరైజ్డ్ డ్రింకర్’ అనేది ఈ సినిమాకు క్యాప్షన్. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో రీసెంట్ గా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ‘ఇనిపించుకోరు’ అంటూ సాగే ఒక లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. అందమైన పదాలతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించారు. “ఇనిపించుకోరు ఇనిపించుకోరు అమ్మాయిలస్సలే ఇనిపించుకోరు ఎంత సెప్పినా.. ఏమి సెప్పినా ఏడిపిస్తుంటారు.. ఏపుకుతింటారు అబ్బాయిలందరినీ ఆగం పట్టిస్తారు” అంటూ అమ్మాయిలపై సెటైర్ లాగా హీరో పాడే పాట ఇది. చంద్రబోస్ ఈ పాటకు ఫన్నీ టోన్ లో సాహిత్యం అందించారు. ఈ పాటను అంతకంటే ఫన్నీగా.. విరుపులతో రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఇక ఈ పాటకు తగ్గట్టే ఓ క్యాచీ ట్యూన్ అందించారు అనూప్ రూబెన్స్.

ఓవరాల్ గా సాంగ్ సరదాగా ఉంది. అయితే ఎంత సరదా సాంగ్ అయినా కొందరు అమ్మాయిల మనోభావాలు దెబ్బతినే అవకాశాన్ని తీసిపారేయ్యలేం. ఎందుకంటే.. కాలం అలా ఉంది. మనసులు అంత సున్నితంగా ఉన్నాయి! మాస్ బీట్ లో సాగే ఈ పాట అబ్బాయిలకే కాదు మాసు ప్రేక్షకులకూ కనెక్ట్ అయ్యేలా ఉంది. ఆలస్యం అమృతం 90 ML.. చూసేయండి..




Please Read Disclaimer