ఆ కమెడియన్ ను తన్నేందుకు సిద్దమైన తమిళ తంబీలు

0

ఒకప్పుడు తమిళ సినీ పరిశ్రమలో వడివేలు ఏ స్థాయిలో కమెడియన్ గా రాణించాడో తెల్సిందే. తెలుగులో బ్రహ్మానందం సాగించినట్లుగా వడివేలు అక్కడ హవా సాగించాడు. తమిళంలో ప్రస్తుతం వడివేలు శకం ముగిసి యోగి బాబు శకం నడుస్తుంది. రోజుకు లక్ష రెండు లక్షలు.. అయిదు లక్షలు అంటూ భారీ పారితోషకం డిమాండ్ చేసినా కూడా యోగి బాబును తమ సినిమాల్లో నటింపజేసేందుకు నిర్మాతలు వెనుకాడటం లేదు. స్టార్ హీరోలకు యోగి బాబు మోస్ట్ వాంటెడ్ అయ్యాడు.

ఒక వైపు స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా చేస్తూనే మరో వైపు హీరోగా కూడా ఈయన చేస్తున్నాడు. ఇప్పటికే ఈయన హీరోగా చేసిన సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యింది. అందుకే అదే జోష్ తో కాక్ టేల్ అనే టైటిల్ తో మరో సినిమాను యోగి బాబు చేస్తున్నాడు. ఈ సినిమాకు విజయ్ మురుగన్ దర్శకత్వం వహిస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు ఈ చిత్రం కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూశారు. తాజాగా ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత యోగి బాబును తన్నేంత కోపంతో తమిళ తంబీలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

ఫస్ట్ లుక్ లో తమిళ ఆరాద్య దైవం మురుగన్ లుక్ లో యోగి బాబు ఉన్నాడు. మురుగన్ అవతారంలో కమెడియన్ ఉండకూడదా అనే కదా మీ ప్రశ్న. ఉండవచ్చు.. కాని కింద టైటిల్ కాక్ టైల్ అని ఉండటమే తమిళ ఆడియన్స్ కు నచ్చడం లేదు. కాక్ టైల్ అంటే మద్యంకు సంబంధించిన పదం. అలాంటి టైటిల్ తో సినిమా తీస్తూ ఇలాంటి గెటప్ వేసుకోవడం.. పైగా దాన్ని ఫస్ట్ లుక్ గా విడుదల చేసి దానిపై కాక్ టైల్ అంటూ పెట్టడంను తీవ్రంగా తప్పుబడుతున్నారు. మురుగన్ భక్తులు యోగిబాబు కనిపిస్తే తన్నేందుకు కూడా వెనుకాడేలా లేరు.
Please Read Disclaimer