మెగా ‘లూసీఫర్’ కోసం ఇంకెంత మంది?

0

మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రం ‘ఆచార్య’ను స్పీడ్ గా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆగస్టులో ఆచార్య ప్రేక్షకుల ముందుకు రావడం దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్నట్లు గా ప్రచారం జరుగుతోంది. ఒక వైపు ఆచార్యతో బిజీగా ఉన్న చిరు మరో వైపు తదుపరి చిత్రం విషయంలో కూడా చర్చు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ ను మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేయబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. చిరు తర్వాత చిత్రం లూసీఫర్ రీమేక్ అని దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఈ రీమేక్ కు దర్శకుడు ఎవరు అనే విషయమై గత కొన్ని రోజులుగా మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. మొదట సుకుమార్ పేరు వినిపించింది. అక్కడ నుండి వినాయక్.. హరీష్ శంకర్ తో పాటు ఇంకా కొందరి పేర్లు కూడా వినిపించాయి. తాజాగా మరో యంగ్ డైరెక్టర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.

ప్రభాస్ తో సాహో వంటి భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించిన సుజీత్ ను లూసీఫర్ చిత్రం రీమేక్ కు దర్శకుడిగా పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. కొన్ని రోజుల క్రితం ఈయన రామ్ చరణ్ తో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అప్పుడే లూసీఫర్ చిత్రం దర్శకత్వ బాధ్యతలు తీసుకోవాల్సిందిగా చరణ్ సూచించాడట. లూసీఫర్ రీమేక్ సక్సెస్ అయితే చరణ్ హీరోగా సుజీత్ కు ఛాన్స్ ఇస్తామన్నారట. అలా లూసీఫర్ రీమేక్ కు సుజీత్ పేరు వార్తల్లోకి వచ్చింది. ఈ రీమేక్ ప్రారంభం అవ్వడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కనుక ఇంకెంత మంది పేర్లు పరిశీలనకు వస్తాయో..!
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-