వెంకీ తో యంగ్ డైరెక్టర్ జాక్ పాట్

0

విక్టరీ వెంకటేష్ కొత్త దర్శకుల తో అంత తొందరగా రిస్క్ తీసుకోడు. వీలైనంత వరకూ సేఫ్ జోన్ కథల్ని.. సీనియర్ దర్శకులనే ఎంచుకుంటారు? అందుకే వెంకీ సినిమాల లిస్ట్ తిరగేస్తే? ఎక్కువగా విజయాలు అందుకున్న దర్శకులే ఉంటారు. ఆ మధ్య మారుతి తో `బాబు బంగారం` అనే సినిమా చేసి ఘోరంగా దెబ్బయ్యాడు. మారుతి అందుకున్న రెండు.. మూడు చిన్న పాటి విజయాలు చూసి అవకాశం ఇచ్చాడు. కానీ ఆ నమ్మకాన్ని మారుతి నిలబెట్టుకోలేకోయాడు. తాజాగా వెంకటేష్ మరోసారి రిస్క్ తీసుకోబోతున్నారని తెలుస్తోంది.

మరోసారి నవతరం దర్శకుడితో వెంకీ సాహసం చేయబోతున్నారు. ఇంతకీ ఎవరా యువదర్శకుడు? అంటే.. `పెళ్లి చూపులు` ఫేం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకీ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారట. వెంకీ మామ రిలీజ్ ప్రమోషన్స్ లో నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ కథ సిద్దం చేస్తున్నాడని.. ఏ క్షణమైనా ఆసినిమా సెట్స్ కు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు.

తరుణ్ భాస్కర్ దర్శకుడిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. తొలి సినిమా పెళ్లి చూపులు మంచి విజయం సాధించినా మలి సినిమా `ఈ నగరానికి ఏమైంది` ఆశించిన ఫలితాన్ని ఇవ్వని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో వేరొక యంగ్ హీరో ఎవరూ తరుణ్ కి అవకాశం ఇవ్వలేదు. తనకు తొలి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దేవరకొండ నిర్మాతగా మారి తరుణ్ ని హీరోని చేసినా ఫలితం ఏమిటో తెలిసిందే. అయితే తరుణ్ తిరిగి దర్శకుడి గానే కొనసాగనున్నారని తెలుస్తోంది. ఇప్పుడు వెంకీ లాంటి సీనియర్ స్టార్ తరుణ్ భాస్కర్ వైపు ఓ లుక్కేయడం సర్వత్రా చర్చకొచ్చింది. దగ్గుబాటి కాంపౌండ్ కి తాను రుణపడి ఉన్నానని.. ఇంతకు ముందు తరుణ్ భాస్కర్ తన విధేయత ను చాటుకున్నాడు. అందుకే ఈ ఆఫర్ అన్న టాక్ వినిపిస్తోంది.
Please Read Disclaimer