జక్కన్న సక్సెస్ సీక్రెట్ చెప్పిన యంగ్ డైరెక్టర్

0

టాలీవుడ్ ను మరోస్థాయికి తీసుకెళ్లటమే కాదు.. ఆయన సినిమా అంటే చాలు బాలీవుడ్ మొదలు హాలీవుడ్ వరకూ ఎవరైనా.. ఏ పాత్ర చేసేందుకైనా రెఢీ అనేసే పరిస్థితి. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు.. ఎస్ఎస్ రాజమౌళి. తాను ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో ఏ ఒక్కటి ఫెయిల్ కాకుండా తీసిన దర్శకుడిగా ఆయనకున్న పేరు అంతా ఇంతా కాదు.

జక్కన్న సక్సెస్ సీక్రెట్ ఏమిటన్న విషయం మీద ఫోకస్ పెట్టనోళ్లు లేరు. కానీ.. ఒక సక్సెస్ ఫుల్ పర్సనాల్టీ విజయం.. మరో విజయవంతమైన వ్యక్తి గుర్తించే అవకాశం ఉన్నట్లే.. తాజాగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్రాక్ చేసినట్లుగా చెప్పుకొచ్చారు.

ఇప్పటివరకూ తాను తీసిన నాలుగు సినిమాలు (పటాస్ సుప్రీమ్ రాజా ది గ్రేట్ ఎఫ్2) మంచి విజయాన్ని దక్కించుకున్నవే. ఐదో సినిమాగా మహేశ్ బాబుతో సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన టీజర్ దుమ్ము రేపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జక్కన్న సీక్రెట్ ఫార్ములాను తాను ట్రాక్ చేసినట్లుగా చెప్పుకొచ్చారు.

జక్కన్న అంత సక్సెస్ ఫుల్ దర్శకుడు ఎలా అయ్యారు? ఆయన తీసిన సినిమాల్లో ఏ ఒక్కటి మిస్ కాకుండా అన్ని ఎలా హిట్ కొడుతున్నారు? అన్న విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఆయన తన బలాన్ని ఎప్పుడూ వదిలిపెట్టి సినిమా చేయలేదు. ఆయన బలం ఎమోషన్. దాని చుట్టూనే ఆయన సినిమా ఉంటుందన్నాడు.

ఈగ అయినా బాహుబలి లాంటి ఫాంటసీ అయినా తన బలమైన ఎమోషన్ ను మిస్ కాకుండా సినిమాలు చేయటంతో సక్సెస్ ఆయన వెంటే ఉందన్నారు. అందుకే.. మన బలాన్ని ఎప్పుడూ వదలకూడదు. అప్పుడు సినిమా మిస్ ఫైర్ అయ్యే అవకాశం తక్కువ.. అందుకే కథ రాసుకునే దశ నుంచే జాగ్రత్తలు తీసుకోవటం వల్లే తన సినిమాలు వరుస పెట్టి సక్సెస్ అవుతున్నాయని చెప్పాలి. మరి.. అనిల్ ట్రాక్ చేసిన తన సక్సెస్ ఫార్ములాపై జక్కన్న ఎలా రియాక్ట్ అవుతారో?
Please Read Disclaimer