భామల కాంటాక్ట్స్ కోసం తపిస్తున్న హీరో

0

గ్లామర్ చుట్టూ తిరిగే పరిశ్రమ ఇది. గ్లామర్ గ్రామర్ నేర్పిస్తుంది. ఇక్కడ గ్లామర్ కు ప్రతిభ యాడైతే ఎదురే ఉండదు. చాలా తక్కువ సమయంలో నేము ఫేము వచ్చేస్తుంది. సకల సౌకర్యాలు భోగాలు అందుతాయి. అయితే ఈ గ్లామర్ అన్న పాయింటే యువహీరోల్ని సైడు దారి పట్టించేస్తోంది. అయితే సదరు హీరోలు గ్లామరస్ బ్యూటీస్ మత్తులో పడిపోయి గ్రామర్ మర్చిపోయి నటనపై దృష్టి సారించకపోతే ఎలా ఉంటుందో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పరిశ్రమలో ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన ఓ హీరో అన్నీ ఉండీ ఈ గ్లామర్ మాయలో పడిపోయి కెరీర్ ని నాశనం చేసుకున్నాడు. వ్యక్తిగత జీవితం కూడా ఈ తరహాలోనే రకరకాల కారణాలతో చెడింది అందుకే.

ఎవరైనా అందాల హీరోయిన్ కొత్తగా పరిచయమైతే చాలు ఫోన్ నంబర్ అడిగేస్తున్నాడట. అంతగా ఆఫర్లు లేని హీరో .. కెరీర్ లో స్ట్రగుల్ ఉన్నా ఎందుకిలా చేస్తున్నాడు? కాంటాక్ట్స్ అవసరమే కానీ.. అదే వ్యాపకంగా ఉంటే కష్టమే మరి. సదరు హీరో బ్యాక్ గ్రౌండ్ తెలుసు కాబట్టి అతడు అడగ్గానే సదరు కుర్ర బ్యూటీస్ ఫోన్ నంబర్లు ఇచ్చేస్తున్నారట. సదరు హీరో సింగిల్ స్టాటస్ లో ఉండడంతోనే ఈ సమస్యనా? అన్న సందేహం వ్యక్తమవుతోంది.

అయితే పరిశ్రమ మొత్తం కాంటాక్ట్స్ పైనే నడుస్తుంటుంది కాబట్టి కాంటాక్ట్స్ షేర్ చేసుకోవడం కూడా తప్పనిసరి. ఇక్కడికి కెరీర్ కోసం వచ్చే భామలు కాంటాక్ట్ నంబర్ ఇవ్వక తప్పని పరిస్థితి. సరిగ్గా ఇదే కారణంతో అలా మరీ ఎక్కువ చొరవ తీసుకుంటే తప్పే. ఇక కెరీర్ పరంగా తిరిగి ఎలా సెట్ రైట్ అవ్వాలి? అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకే గ్లామర్ వెంట పడకుండా ఆ దిశగా ఆలోచిస్తే బావుంటుందేమో! అంటూ సూచిస్తున్నారు విశ్లేషకులు.
Please Read Disclaimer