ఆ బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో

0

ఉదయ్ కిరణ్.. ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిన్న వయసులోనే స్టార్ డం దక్కించుకుని ఎగసిన కెరటంలో కిందకు పడి కెరీర్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న హీరో ఉదయ్ కిరణ్ ఏవో కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. ఆయన జీవిత చరిత్రను బయోపిక్ గా తీసేందుకు పలువురు దర్శకులు ప్రయత్నాలు చేశారు. కాని ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు.

గత రెండు మూడు రోజులుగా మళ్లీ ఉదయ్ కిరణ్ బయోపిక్ గురించిన వార్తలు జోరుగా వచ్చాయి. యువ హీరో సందీప్ కిషన్ ఈ బయోపిక్ కు ఆసక్తి చూపుతున్నాడని.. ఉదయ్ కిరణ్ గా నటించేందుకు సందీప్ కిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ సోషల్ మీడియాలో పుకార్లు గుప్పుమన్నాయి. పలు ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ విషయాన్ని ప్రసారం చేయడం.. ప్రచురితం చేయడం వల్ల నిజమేనేమో అనుకున్నారు. కాని ఆ వార్తలను పుకార్లంటూ సందీప్ కిషన్ కొట్టి పారేశాడు.

గత రెండు మూడు రోజులుగా వస్తున్న వార్తలు నిజం కాదని అన్నాడు. నన్ను ఆ బయోపిక్ గురించి ఎవరు సంప్రదించలేదన్నాడు. అలాగే ప్రస్తుతం తనకు ఎలాంటి బయోపిక్ చేసే ఆలోచన.. నటించే ఆలోచన లేదని పేర్కొన్నాడు. ఉదయ్ కిరణ్ బయోపిక్ ను చేసేందుకు.. అందులో నటించేందుకు చాలా వరకు ఆసక్తి చూపించరు. ఎందుకంటే ఆ సినిమాలో నటిస్తే మెగా కాంపౌండ్ నుండి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని ఎక్కువ శాతం భావిస్తున్నారట. అందుకే ఉదయ్ కిరణ్ బయోపిక్ ఇప్పుడే కాదు ఎప్పటికి రాకపోవచ్చు అంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. కాని కొందరు మాత్రం వర్మలాంటి వారు తల్చుకుంటేనే అది అవుతుందని కామెడీగా కామెంట్స్ చేస్తున్నారు.
Please Read Disclaimer