ఆ యంగ్ హీరోకి గే ప్రపోజల్స్!!

0

ఇమేజ్ కి తగ్గట్టే అవకాశాలొస్తాయి. అది వెండితెరపై అయినా రియల్ లైఫ్ లో అయినా. ఆ యంగ్ హీరోకి అలాంటి చిక్కే వచ్చి పడింది. అవకాశం వచ్చింది కదా అని అతడు ఓ సినిమాలో గే పాత్రలో నటించాడు. ఇంకేం ఉంది.. సదరు హీరోగారికి గేల్లో విపరీతమైన క్రేజు పెరిగిందట. ఆరు బయట `గే`లంతా అతడిని కలల రాకుమారుడిలా భావించి డ్రీమ్ సాంగ్స్ వేసుకుంటున్నారు.

ఫలితంగా అతడు ఎక్కడికి వెళ్లినా.. గే ప్రపోజల్స్ ఎక్కువగా వస్తున్నాయట. పరిశ్రమలోని గేలు అతడికి ప్రపోజ్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఆ విషయాన్ని సదరు హీరోగారు తన సన్నిహిత స్నేహితులకు చెప్పుకుని మరీ బావురుమన్నాడట. స్వలింగ సంపర్కుల(గే) సంస్కృతిని సమాజం ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటోంది. వారికంటూ కొన్ని చట్టాలు ఉన్నాయి. పెళ్లిళ్లతో లైఫ్ లో దర్జాగా సెటిలవుతున్నారు. ఇలాంటప్పుడు వారి మనోభావాల్ని కించపరిచినా కష్టమే. దానిని బట్టి సదరు హీరో ఎరక్కపోయి ఇరుక్కున్నట్టు అయ్యిందట.

పరిశ్రమలో కెరీర్ పరంగానూ ఒకసారి `గే`అన్న ముద్ర పడితే దాని ప్రభావం వచ్చే అవకాశాల పైనా పడుతుంటుంది. దర్శకరచయితలు ఆ తరహా పాత్రల్ని ఆఫర్ చేస్తారు. కారణం ఏదైనా అతడికి అన్ని వైపుల నుంచి చిక్కులు తప్పడం లేదని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఎవరా హీరో.. గెస్ హూ?
Please Read Disclaimer