నమ్మి ఎదురు చూస్తే హ్యాండిచ్చిన యంగ్ హీరో!

0

సినీ రంగంలో నమ్మకం.. టాలెంటే పెట్టుబడి. ఎథిక్స్ ఏ రోజైతే దారి తప్పుతాయో ఆ రోజే అక్కడి వారి జీవితాలు కూడా గతి తప్పుతుంటాయి. హీరోగా ఛాన్సిస్తాడని… లేదూ దర్శకుడిగా ఓ అవకాశం దక్కుతుందని ఒకరినొకరు నమ్మే పరిస్థితి ఉంటుంది. దర్శకుడు అవకాశం ఇస్తాడని హీరోలు… హీరో అడగ్గానే ఓకే చెబుతాడని డైరెక్టర్ సంవత్సరాల తరబడి ఎదురుచూస్తుంటారు. అనుకున్నది జరిగితే అద్భుతం జరిగినట్టేనని ఇక్కడి వారు ఆశగా ఎదురుచూస్తుంటారు. ఏళ్లు గడుస్తున్నా చెక్కు చెదరని విశ్వాసంతో ఉంటారు. కాలం కరిగిపోతున్నా గుడ్డిగా నమ్మి ఎదురు చూసేవాళ్లు ఉంటారు.

ఇదే కేటగిరీలో చాలా మంది యువ దర్శకులు ఓ యంగ్ హీరో తమకు సినిమా ఇస్తాడని నమ్మి దారుణంగా మోసపోయారని తెలుస్తోంది. తనని నమ్మినందుకు ఆ యంగ్ హీరో ఆ డైరెక్టర్లకు హ్యాండిచ్చాడు. ఇటీవలే ఓ ఫ్లాప్ సినిమాని సొంతం చేసుకున్న ఓ యంగ్ హీరో గత కొంత కాలంగా కొంత మంది యంగ్ డైరెక్టర్లను మభ్య పెడుతూ కలిసి సినిమా చేద్దామని మురిపిస్తూ వాళ్లలో లేని ఆశలు కల్పించాడు. తను నటిస్తున్న సినిమా హిట్ అయితే వరుసగా యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తానని.. అంత వరకు వేచి చూడమని చెప్పుకుంటూ వచ్చాడు. చివరికి తను నటించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసరికి ముఖం చాటేశాడు.

తన కోసం ఏడాది కాలంగా మరో ఆలోచన లేకుండా ఎదురుచూసిన ఐదుగురు దర్శకులను పక్కన పెట్టిన సదరు యంగ్ హీరో వేరొక కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ అయిపోవడంతో తమని నమ్మించి మోసం చేశాడని తిట్టుకుంటూ ఆ యువ దక్శకులు చేసేదేం లేక మరో హీరో కోసం వేట మొదలుపెట్టారట. సినిమా ఇండస్ట్రీ అంటే ఇంతే మరి. కలలు గంటూనే బతకాలి ఇక్కడ.
Please Read Disclaimer