బ్రేకప్ బాధలో యువ హీరో!

0

ఆయన ఒక యువహీరో.. ఫిలిం బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది. తెలుగులోనే కాదు సౌత్ మొత్తం మీద ఆయనను గుర్తుపడతారు. చాలా ఈజీ గోయింగ్. ఫ్రెండ్లీ. అందుకే చాలామంది అమ్మాయిలతో ప్రేమకలాపాలు సాగించాడు. అయితే ఒక ఏడాది నుంచి ఓ అమ్మాయితో సీరియస్ గా ప్రేమలో పడ్డాడట. ఆ అమ్మయి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి కాదు. అయితే ఇద్దరి మధ్య కొద్దిరోజుల క్రితమే ఏదో గొడవ జరగడంతో అమ్మాయి హర్ట్ అయిందట.. వెంటనే హీరోకు హ్యాండ్ ఇచ్చేసిందట.

ఉన్నట్టుండి హీరోను వదిలేసి ఫ్లైట్ ఎక్కి అమెరికా కు వెళ్లిపోయిందట. మన యువహీరోను దూరంగా పెడుతోందట. ఫోన్ చేస్తే చేస్తే పట్టించుకోవడం లేదట. ప్రేయసి ఇలా తనను దూరం పెడుతూ.. పట్టించుకోకపోవడంతో ఈ హీరో డిప్రెషన్లోకి వెళ్లాడని.. కొంచెం అర్జున్ రెడ్డి స్టైల్ లో తయారయ్యాడని టాక్ వినిపిస్తోంది. డ్రింక్ ఎక్కువైందట.. షూటింగులకు వేళాపాళా లేకుండా రావడం.. షూటింగ్ ఉన్నప్పుడు తాగి రావడం లాంటివి చేస్తూ దర్శక నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాడట.

ఎలాంటి వ్యక్తికైనా వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. ఇలాంటి సమయంలో ఆ ప్రభావం వృత్తిపై పడకుండా చూసుకోవాలని.. లేకపోతే కెరీర్ దెబ్బతినే అవకాశాలు ఉంటాయని ఆయన శ్రేయోభిలాషులు అంటున్నారు. మరి ఆ యువహీరో ఈ సమస్య నుంచి త్వరలోనే బయటపడతాడా లేదా ఇదే ధోరణి కొనసాగిస్తాడా అనేది వేచి చూడాలి.
Please Read Disclaimer