జక్కన ముహూర్తానికే కుర్ర హీరోల సినిమాలు !

0

రాజమౌళి ఏదైనా డేట్ ఫిక్స్ చేశాడంటే దానికి ఓ ప్రాముఖ్యత ఉంటుందనేది నమ్మాల్సిందే. బాహుబలి సిరీస్ లకు కూడా మంచి డేట్స్ ముందే లాక్ చేసుకొని రిలీజ్ చేసారు జక్కన్న. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ విషయంలోనూ అదే చేసాడు. ఆగస్ట్ లో సినిమాలు పెద్దగా రిలీజ్ కానీ టైం చూసి జులై 30 న డేట్ లాక్ చేసుకున్నాడు. కట్ చేస్తే షూటింగ్ డిలే అవ్వడం తో సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిపాడు.

దీంతో రాజమౌళి ముందు పెట్టిన డేట్ ఫ్రీ గా ఉంది. అందుకే ఇప్పుడా డేట్ ను లాక్ చేసుకొని జక్కన్న ముహుర్తానికే సినిమాలు రిలీజ్ చేయాలని చూస్తున్నారు కుర్ర హీరోలు. ఇప్పటికే నితిన్ తన ‘రంగ్ దే’ కోసం ఈ డేట్ ని లాక్ చేసుకున్నట్లు సమాచారం. మరో వైపు వరుణ్ తేజ్ కూడా తన 10వ సినిమాను అదే డేట్ కి రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నాడట. ఇంకా ఐదు నెలలు ఉండటం తో నిర్మాతలు అల్లు వెంకటేష్ సిద్దు డేట్ ని లాక్ చేసుకునే పనిలో ఉన్నారట.

ప్రస్తుతానికైతే వరుణ్ తేజ్ ఆ డేట్ ని టార్గెట్ గా పెట్టుకొనే సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. నితిన్ వరుణ్ మంచి స్నేహితులు మరి నిర్మాతల శ్రేయస్సు కోరి ఇద్దరిలో ఒకరు డేట్ పోస్ట్ పోన్ చేసుకొనే ఛాన్స్ ఉంటుందా అన్నది చూడాలి.
Please Read Disclaimer