చింతామణితో నూనూగు మీసాల కుర్రాడి సరసం

0

రాజులు రాజ్యాలు పోయాక .. జమీందారీ వ్యవస్థ.. ధనస్వాముల వ్యవస్థ మాత్రం మిగిలింది. ఉత్తరాదిన అయితే మెహ్రాస్.. ఛటర్జీస్.. కపూర్స్.. ఖానాస్ అంటూ ధనిక వర్గాల వాళ్లు మిగిలారు. నాటి రాజసం దర్పం అంతా వీళ్లలోనే కనిపిస్తుంది. అయితే ఆరోజుల్లోనే వేశ్య వృత్తి కూడా అంతే ప్రబలంగా ఉండేది. బడా బడా బాబులంతా సీక్రెట్ గా వేశ్యల్ని కలిసి వచ్చేవారు. కొందరైతే వేశ్యా గృహానికి వెళ్లొచ్చి ఇంటావిడతో చీవాట్లు తినేవారు.

ఈ కథంతా వింటుంటే ఇదేదో చింతామణి వ్యవహారంలా ఉందే అంటారా? అవును నిజమే.. ఇది చింతామణి తరహా కథాంశమే. ఆమె వయసు 48.. ఆ కుర్రాడి వయసు 18.. ఆ ఇద్దరి మధ్యా అదిరిపోయే శృంగారం. ఈ తరహా కథాంశాన్ని ఎంచుకుని క్రియేటివ్ లేడీ డైరెక్టర్ మీరా నాయిర్ ఓ అద్భుతమైన కళాఖండాన్ని తీర్చిదిద్దుతున్నారు. 1940 బ్యాక్ డ్రాప్ లో స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన కథాంశాన్ని ఎంతో కళాత్మ కంగా తెరపై చూపించనున్నారు. ఈ సినిమా పేరు `ఏ సూటబుల్ బోయ్`. టైటిల్ కి తగ్గట్టే తాజాగా రివీల్ చేసిన పోస్టర్ లో టబు – ఇషాన్ మధ్య వ్యవహారం వేడెక్కిస్తోంది. పోస్టర్ ని ఎంతో కళాత్మకంగా రూపొందించారని అర్థమవుతోంది. ఒగరు పొగరు చురుకుదనం ఉన్న కుర్రాడు (ఇషాన్ ఖత్తర్) వేశ్య(టబు) తో కులుకుతున్న ఫోటోని ఎంతో కళాదృష్టితో తీర్చిదిద్దడంతో అదో అందమైన పెయింటింగ్ లా కనిపిస్తోంది. టబు పాదాల చెంత ఇషాన్ ఎంతో శ్రద్ధగా వాలిపోయాడు. వయసు తెచ్చిన తుంటరితనం .. ప్రేయసితో ప్రేమ పాఠం అతడి ముఖారవిందంలో కనిపిస్తోంది. జడలో మల్లెలు తురిమి ఎంతో సాంప్రదాయ బద్ధమైన దుస్తుల్లో టబు కనిపిస్తోంది. ఆ కుర్రాడి గడ్డంపై సుతారంగా తాకిన మృధుత్వం కోమలత్వం కనిపిస్తోంది. నేపథ్యంలో పాత ముస్లిం స్టైల్ గృహం ఆకట్టుకుంటోంది.

ఏ సూటబుల్ బోయ్ .. విక్రమ్ సేథ్ నవల స్ఫూర్తితో రూపొందుతోంది. ఇదో టీవీ అడాప్టేషన్. మహేశ్వర్ – లక్నో తదితర చోట్ల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టబు ఇంతకుముందు మీరా నాయిర్ తెరకెక్కించిన `ది నేమ్ షేక్` అనే చిత్రంలో నటించారు. మరోసారి ఈ కలయిక ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. త్వరలో ప్రేక్షకాభిమానుల్ని అలరించేందుకు వస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి సెలబ్రిటీల నుంచి అద్భుత స్పందన వచ్చింది. మీరా రాజ్ పుత్- తారా సుతారియా- ఆయుష్మాన్ ఖురానా- కరణ్ జోహార్ వంటి ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.
Please Read Disclaimer