ఆమె మత్తులో మునిగి తేలుతున్నాడుగా

0

దఢక్ చిత్రం తో హీరోగా మంచి గుర్తింపు దక్కించుకున్న ఇషాన్ ఖట్టర్ ప్రస్తుతం ‘ఏ సూటబుల్ బాయ్’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో వేశ్య సైదా బాయి పాత్రను టబు పోషిస్తోంది. అందమైన వేశ్య వలలో పడి రాజకీయ నాయకుడు అయిన తండ్రికి ఎదురు తిరిగే టీనేజ్ కుర్రాడి పాత్రలో ఇషాన్ కనిపించబోతున్నాడు. ఆమద్య విడుదలైన ఏ సూటబుల్ బాయ్ సినిమా ఫస్ట్ లుక్ సెన్షేషన్ క్రియేట్ చేసింది. ఒక రొమాంటిక్ ఫోజ్ లో టబు ఉండగా ఆమె కాళ్ల వద్ద చాలా ఆరాధన భావంతో ఇషాన్ ఖట్టర్ ఉన్న ఆ ఫొటో సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

టబుతో వర్క్ ఎక్సిపీరియన్స్ గురించి ఇషాన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెమెరా ముందే కాకుండా కెమెరా వెనుక కూడా ఆమెను ఆరాధిస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు. నా హృదయంను ఆమెకు ఇచ్చానంటూ టబుపై తనకున్న ప్రేమను చెబుతున్నాడు. ఆమెకు గాలిబ్ కవితల పుస్తకాన్ని బహుమానంగా ఇవ్వబోతున్నట్లుగా కూడా చెప్పాడు. టబును మిర్చితో పోల్చడమే కాకుండా ఆమెకు ముద్దుగా తబాస్కో అనే పేరును కూడా ఈ కుర్ర హీరో పెట్టుకున్నాడట.

ఆమెతో రొమాంటిక్ సీన్స్ చిత్రీకరణ సమయం లో ఎలాంటి ఎక్స్ పీరియన్స్ చేస్తున్నారంటూ ప్రశ్నించగా.. టబుతో రొమాన్స్ చేయడం చాలా సులభం. ఎందుకంటే ఆమె టబు కనుక. ఎదుటి వారిని ఈజీగా రొమాంటిక్ మూడ్ లోకి దించగల సత్తా ఆమె కళ్లలో ఉంది. అందుకే ఆమెతో రొమాంటిక్ సీన్స్ నాకు కష్టం అవ్వలేదంటున్నాడు. మొత్తానికి ఆమెతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తున్న ఇషాన్ రియల్ లైఫ్ లో కూడా ఆమెతో రొమాన్స్ ను కోరుకుంటున్నాడా ఏంటీ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె వయసులో కనీసం సగం కూడా ఇతడి వయసు లేదు. అలాంటిది ఇషాన్ ఆమె గురించి.. ఆమె ప్రేమ గురించి తెగ మాట్లాడటం పలువురికి అనుమానాలు కలిగిస్తున్నాయి.
Please Read Disclaimer