కుర్ర హీరో.. ఆర్నాల్డ్ లుక్ బాప్ రే

0

సూపర్ స్టార్ మహేష్ హార్డ్ వర్క్ తెలిసిందే. టాలీవుడ్ లో తన స్టార్ డమ్ ని అసాధారణ స్థాయికి తీసుకెళ్లేందుకు అతడు ఎంతో హార్డ్ వర్క్ చేశారు. వీటన్నిటినీ మించి వర్క్ కమిట్ మెంట్ విషయంలో మహేష్ పై ప్రత్యేకించి ప్రశంసలున్నాయి. అయితే ఈ హార్డ్ వర్క్ కమిట్ మెంట్ ని ఎంతో దగ్గరనుంచి చూసిన వాడిగా..మహేష్ బావ సుధీర్ బాబు అంతే హార్డ్ వర్క్ చేస్తున్నారు. చేసే పని కోసం అంతే కమిట్ మెంట్ తో ఆకట్టుకుంటున్నారు.

సుధీర్ హీరోగా ఆరంగేట్రానికి ముందే 6ప్యాక్ బాడీ.. మజిల్స్ తో రంగప్రవేశం చేశాడు. జిమ్నాస్టిక్స్ పై తనకు ఉన్న ప్యాషన్ ని తొలి సినిమా ఆడియో వేదికపై చూపించి ఆశ్చర్యపరిచారు. అతడి కమిట్ మెంట్ పై ప్రశంసలు దక్కాయి. అయితే అది ఒక్క సినిమాతో ఆపేస్తే సరిపోతుందా? ఓవైపు కెరీర్ స్ట్రగుల్ లోనూ సుధీర్ నిరంతరం జిమ్ముల్లో హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నారు.

తాజాగా అతడి ఫిజికల్ ఫిట్ నెస్ కి సంబంధించి ఛేంజోవర్ ఫోటో ఒకటి అంతర్జాలంలో జోరుగా వైరల్ అవుతోంది. సుధీర్ షర్ట్ విప్పి నరాలు పొంగిస్తూ జిమ్ లో శ్రమిస్తున్న తీరు షాకిస్తోంది. అతడి లుక్ ఆర్నాల్డ్ ని తలపిస్తోంది. షర్ట్ విప్పడం మాట అటుంచితే.. ఆ కండల్ని పెంచిన తీరు అసాధారణం. దానివెనక హార్డ్ వర్క్ తో పాటు అతడికి ఎంత పిచ్చి ఉందో అర్థం అవుతోంది. ఇక దీనికోసం నిరంతరం జిమ్ముల్లో ఎంతగా శ్రమించాలో అది కమిట్ మెంట్ తో చేసేవాళ్లకే తెలుస్తుంది. ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న ‘వీ’ చిత్రంలో అతడు ఓ ఆసక్తికర పాత్రలో నటిస్తున్నాడు. అందుకే అతడు భీకరమైన ఆకారం కోసం ఇంతగా శ్రమిస్తున్నాడు.

‘మాటలు క్యాప్షన్స్ కాదు.. యాక్షన్ లో చూపించాలి’ అంటూ సుధీర్ ఈ ఫోటోకి కామెంట్ ని పోస్ట్ చేశాడు. ఇందుకోసం పర్సనల్ ట్రైనర్ సాయంతో ఎంతో శ్రమించాడు. ఇంతకుముందు రెండు వేల కేజీల బరువున్న కార్ ని తోసుకుంటూ వెళుతూ అతడు చేసిన సాహసం మర్చిపోలేం. ‘వీ’ చిత్రం థాయ్ ల్యాండ్ షెడ్యూల్ పూర్తయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లోనే చిత్రీకరణ సాగిస్తున్నారు. నాని ఈ చిత్రంలో ఇంట్రెస్టింగ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer