లీక్స్ తో సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటున్న హీరో!

0

ఈ తరం మునుపటి తరంలా ఉండదు. అలా ఉంటే ఈ జెనరేషన్ వారిని అవుట్ డేటెడ్ అని అంటారు. మునుపటి తరంలో తక్కువమంది మాత్రమే సెల్ఫ్ ప్రమోషన్ పై దృష్టి పెట్టేవారు. ఎక్కుమంది తమ గొప్పదనాన్ని చెప్పుకోవడానికి ఇష్టపడేవారు కాదు. ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్. ఫేస్ బుక్ ఖాతాలు తీసుకుంటే.. నేను గొప్ప నా ఆలోచనలు గొప్ప.. నా ఫోటోలు చూడండి.. నా వీడియోలు చూడండి.. అని ‘సెల్ఫ్ డబ్బా’ కొట్టుకోవడమే పని. ఇక సెలబ్రిటీలకు ఈ సెల్ఫ్ డబ్బా చాలా అవసరం. ఎందుకంటే ఒక నెల పాటు ఒక హీరో గురించి ఏదో ఒక వార్త రాకపోతే ఆ హీరో గురించి జనాలు మర్చిపోయేలా ఉన్నారు. అందుకే హీరోలు తమ గురించి ఏదో ఒక రూపంలో టముకు వేసుకుంటూనే ఉంటారు పెద్ద స్టార్ల దగ్గరనుండి మొదలు పెడితే యువ హీరోల వరకూ ఇదే దరువు.

రీసెంట్ గా ఒక యువహీరోకు తనకు సంబంధించిన వార్తలు పెద్దగా రావడంలేదని.. పెద్దగా తన పేరు లైమ్ లైట్ లో లేదని అనిపించింది. ఆలా అనిపించిందే తడవుగా తన ప్రేమ వ్యవహారానికి సంబంధించిన ఒక లీక్ ఇస్తూ మీడియాలో ‘గాసిప్’ లాగా ఆ వార్తను సెట్ చేసుకున్నాడట. ఇదంతా బాలీవుడ్ హీరోలు కదా చేసేది.. మన తెలుగుహీరోలు కూడా చేస్తున్నారా అంటే.. ఆ ప్రశ్నకు ‘అవును’ అని బదులు చెప్పాల్సి ఉంటుంది. దీని ద్వారా సదరు హీరోను లవర్ బాయ్ అని.. అమ్మాయిల కలల రాకుమారుడుగా అనుకుంటారేమో అని ఆశ. ఇలాంటి ఇమేజ్ బిల్డప్ చేసుకోవడం హీరో తదుపరి సినిమాలకు ఎప్పుడూ ప్లస్ అవుతుంది.

విజ్ఞులైన పాఠకులు కొందరు గాసిప్స్ పై ఇంతెత్తున మండిపడుతుంటారు. మరి హీరోలే స్వయంగా లైమ్ లైట్ లో ఉండడం కోసం గాసిప్ లు రాయమని ప్రోత్సహిస్తుంటే దీనికి సమాధానం ఏం చెప్పగలం?
Please Read Disclaimer