యువ హీరో వైఫ్ సూసైడ్ కహానీ ఇదీ!

0

బిగ్బాస్ 3 సీజన్ లో రచ్చ చేసిన వరుణ్ సందేశ్- వితిక షెరుకి ఫ్యాన్స్ పెరిగిన సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ ఎంట్రీకి ముందు వార్తల్లో నిలిచి వితిక సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సూసైడ్ ప్రయత్నం చేసిందంటూ వితిక అప్పట్లో వార్తల్లో నిలిచింది. దీంతో ఒక్కసారిగా వరుణ్- వితికల మధ్య మనస్పర్థలొచ్చాయని.. ఆ కారణంగానే వితిక సూసైడ్ అటెంప్ట్ చేసిందని వరుస కథనాలు వినిపించాయి. అయితే అదే నిజమని అంతా అనుకున్నారు. కానీ దాని వెనక పెద్ద కహానీనే వుందని తాజాగా వెలుగులోకి వచ్చింది.

బిగ్బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన వితిక తన తదుపరి ప్రయత్నాల్లో బిజీ అయిపోయింది. ఇందులో భాగంగా ఓ మీడియా కిచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. అమెరికా వాతావరణానికి అలవాటు పడిన తనకు ఇండియా వచ్చిన తరువాత పెద్దగా నిద్ర పట్టేది కాదని.. ఆ కారణంగానే తొలి సారి నిద్ర మాత్ర వేసుకున్నానని… మోతదుకు మించి నాలుగు టాబ్లెట్లు వేసుకోవడంతో ఘాడ నిద్రలోకి వెళ్లిపోయానని చెప్పింది. అది చూసిన మా అమ్మకు భయమేసి తనని ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆ సమయంలో నా ఫోన్లో తీసిన ఓ ఫొటో నా స్నేహితురాలికి వెళ్లడం.. ఆమె దాన్ని బయటికి వదలడంతో పెద్ద ఇష్యూ అయిందని.. దాన్ని ఆధారం చేసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డానని ప్రచారం జరిగిందని చెప్పింది.

ఆ సూసైడ్ వార్తల వెనక అసలు కహానీని వితిక ఎట్టకేలకు బయటపెట్టింది. ప్రస్తుతం ఈ భామ ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కథానాయికగానూ రీలాంచ్ అయ్యే ప్రయత్నాల్లో ఉందట. వరుణ్ మరోవైపు తన ప్రయత్నాల్లో తాను ఉన్నాడు.
Please Read Disclaimer