ఇదేం సిత్రం.. పాత టైటిళ్లతో నెగ్గుకొస్తారా?

0

పాత సినిమాల టైటిళ్లను.. క్రేజీ హీరోల టైటిళ్లను ఉపయోగిస్తే సినిమా హిట్టవుతుందా? అంటే అస్సలు అందుకు ఆస్కారమే లేదన్నది క్రిటిక్స్ విశ్లేషణ. చిరంజీవి.. కృష్ణ.. బాలకృష్ణ లాంటి స్టార్ల టైటిల్స్ ని అప్పుడప్పుడు యంగ్ హీరోలు ఉపయోగించుకుంటున్నారు. ఇరుగు పొరుగు పరిశ్రమల నుంచి వచ్చే సినిమాలకు ఈ టైటిల్స్ ని విరివిగా ఉపయోగిస్తున్నారు. కానీ ఏం లాభం? సినిమాలో కంటెంట్ లేకపోతే నిర్ధ్వంద్వంగా తిరస్కరిస్తున్నారు ఆడియెన్.

ఇంతకుముందు కార్తీ హీరోగా వచ్చిన దొంగ సినిమా అలానే అడ్రెస్ గల్లంతైంది. ఖైదీ సినిమా విజయం సాధించినట్టు దొంగ సక్సెస్ సాధించలేదు. ఇవి రెండూ మెగాస్టార్ చిరంజీవి నటించిన పాత క్లాసిక్ సినిమాల టైటిల్స్. అవి రెండూ అప్పట్లో ఎంతటి బ్లాక్ బస్టర్లో తెలిసిందే. ఆ రెండు టైటిల్స్ ని ఎంపిక చేసుకుని కార్తీ హాట్ టాపిక్ అయ్యాడు. కానీ ఏ సినిమాలో దమ్ముందో దానిని మాత్రమే జనం ఆదరించారు. చిరంజీవి టైటిల్ పెట్టుకున్నాడని సినిమా థియేటర్లకు రాలేదు.

ఇప్పుడు యంగ్ హీరో జీవా సైతం ఇదే తరహాలో చిరు సినిమా టైటిల్స్ ని ఉపయోగించుకుని హిట్టు కొట్టాలని అనుకుంటున్నాడు. `స్టాలిన్ – అందరి వాడు` అంటూ చిరు సినిమాలకు చెందిన రెండు టైటిల్స్ ని మిక్స్ చేసి ఇప్పుడు జీవా నటించిన ఓ అనువాద చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే పాత టైటిల్స్ ఉపయోగించడం వల్ల కలిసొస్తుందా? కనీసం మెగా ఫ్యాన్స్ లో అయినా మైలేజ్ వస్తుందా? అంటే అస్సలు అందుకు ఆస్కారమే లేదు. సినిమాలో దమ్ముంటే జనం థియేటర్లకు వచ్చి చూస్తారు. లేదంటే నిర్లక్ష్యంగా లైట్ తీస్కుంటారు అని ఇప్పటికే ప్రూవైంది. పైగా పాత టైటిల్ ని ఉపయోగించారు అంటే పాత సినిమాలా ఉంటుందని లైట్ తీస్కునే ప్రమాదం లేకపోలేదు. అయితే టైటిల్ జనాల మైండ్ లో రిజిస్టర్ అవ్వడానికి ఈ ప్రయోగం వల్ల ఆస్కారం కనిపిస్తోంది. ఆ ఒక్క రీజన్ తోనే ఇలా ఎంపిక చేసుకుంటున్నారని భావించాల్సి ఉంటుంది.
Please Read Disclaimer