అన్నతో ఇలాగా? స్టార్ డాటర్ కి చీవాట్లు!!

0

భారతదేశం సెంటిమెంటుకు.. సంప్రదాయానికి నిలయం. మన గొప్పతనాన్ని అమెరికా దేశాధినేత ట్రంప్ సైతం పొగిడేసిన వైనాన్ని మర్చిపోలేం. పాశ్చాత్య ధోరణి ఎంత పెరిగినా ఇంకా ఏదో మూల భారతీయత అన్నది మిగిలి ఉంది. అందుకే ఏవైనా వెకిలి చేష్టలు చేయాలంటే కొంటె కోనంగులు భయపడుతుంటారు. విదేశీలే మన దేశ విలువల గురించి కొనియాడుతుంటే బాలీవుడ్ లోని కొందరు భామలు ఈ ప్రతిష్టను మంటగలుపుతున్నారన్న విమర్శలు తప్పడం లేదు.

తాజాగా బాలీవుడ్ భామ సారా అలీ ఖాన్ చేసిన ఓ చెత్త పనికి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇటీవల సారా తన సోదరుడు ఇబ్రహీంతో కలిసి మాల్దీవుల పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఎంతో హుషారుగా అక్కడ పరిసరాలను ఆస్వాధించి బీచ్ విహారంలో మునిగి తేలింది. దీనికంటే ముందు తన తమ్ముడి బర్త్ డే కి హాజరు కావాల్సి ఉన్నా.. సారా సెలబ్రేట్ చేయలేకపోయింది. దీనికి తన తమ్ముడు ఫీలవడంతో పనిలో పనిగా తనతో పాటే మాల్దీవులకు తీసుకెళ్లిందట.

అయితే అక్కడ సముద్ర తీరాన తన తమ్ముడి తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేసి చీవాట్లు తింటోంది. తన తమ్ముడికి బర్త్డే విషెస్ చెప్పండి అంటూ ఓ బికినీ ఫోటోని షేర్ చేసింది. తమ్ముడి విషెస్ కోరడం బాగానే ఉన్నా ఈ ఫొటో చూసిన వారు సారాపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అసలు సారా ఎందుకింత దిగజారిందబ్బా అంటూ మదనపడిపోతున్నారు. దీనంతటికి కారణం తాను బికినీ ధరించి ఉండటమే అలా సెక్సీగా ఫోజివ్వడమే. ఎంత బీచ్ అయితే మాత్రం తన తమ్ముడి పక్కన ఇలా బికినీలో ఆ ఫోజులేమిటి? అంటూ సాంప్రదాయ వాదులు ఘాటుగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇది అంత మంచి పద్ధతి కానే కాదని.. కచ్చితం గా ఇలాంటివి మళ్లీ రిపీటైతే సహించబోమని హెచ్చరిస్తున్నారు. ఈ ఫోటోలో సారా పక్కన నిలబడిన బ్రదర్ ఇబ్రహీం చాలా ఇబ్బంది పడ్డారట. ఇకనైనా సారా కుటుంబ విలువలు కాపాడుకునేలా ఉంటే మంచిదని సోషల్ మీడియాలో సలహాలిచ్చేస్తున్నాయి. మరి సారా తాను చేసిన తప్పేంటో ఇప్పటికైనా తెలుసుకుంటుందా లేదా? ఇది కూడా తప్పేనా? అంటూ తేలిగ్గా తీసుకుంటుందా? అన్నది చూడాలి. సారా నటించిన `లవ్ ఆజ్ కల్` ఫిబ్రవరి 14 న ప్రేమికుల రోజు కానుకగా రిలీజైన సంగతి తెలిందే. ఈ సినిమాలోనూ సారా హద్దులు చెరిపేసి ఎక్స్ పోజ్ చేసిందన్న విమర్శలు ఎదురయ్యాయి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-