హీరోల్ని మించి మెయింటెయిన్ చేస్తున్నాడు

0

కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ట్యాలెంట్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కొలవెరి డీ.. సంచలనం తర్వాత అగ్ర కథానాయకుల సినిమాలకు పని చేసాడు. ఇండస్ట్రీలో బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పాపులరయ్యాడు. తన ప్రతి సినిమాకి ట్యూన్స్ లో కొత్తదనం ప్రయత్నిస్తుంటాడు. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకూ అందరితోనూ పని చేస్తూ.. చార్ట్ బస్టర్ మ్యూజిక్ అందించడం తనకే చెల్లింది. సాక్షాత్తు గురూజీ త్రివిక్రమ్ నే పవన్ కళ్యాణ్ `అజ్ఞాతవాసి` కోసం అనిరుధ్ తో కంపోజింగ్ చేయించుకున్నాడంటే.. అతని లో ఆ కసిని గుర్తించారు కాబట్టే. అనిరుధ్ ట్యాలెంట్ మ్యాటర్ అటుంచితే.. అతడిలోని ప్లేబోయ్ క్వాలిటీ గురించి ప్రత్యేకంగా చర్చించాలి.

అనిరుధ్ అందరిలా రొటీన్ మ్యూజిక్ డైరెక్టర్ కానేకాదు. ఒక పాప్ స్టార్ తరహా లో స్టేజ్ షోలు చేయడం… డాన్సర్లతో కలిసి స్టెప్పులేయడం లాంటి నైపుణ్యం తన సొంతం. దేవీ శ్రీ ప్రసాద్ తర్వాత అంత ఎనర్జీ చూపించే సంగీత దర్శకుడు అనిరుధ్ మాత్రమేనని చెప్పాలి. అలాగే ఎఫైర్లు సాగించడంలోనూ అనిరుధ్ పేరు ఎప్పటికప్పుడు మీడియాలో హైలైట్ అవుతూనే ఉంది. అప్పట్లో సుచీలీక్స్ లో అనిరుధ్ లోని రొమాంటిక్ యాంగిల్ ని సుచీ బయటపెట్టింది. కథానాయిక అమలాపాల్ తో.. గాయని కం నటి ఆండ్రియోతో సన్నిహితంగా ఉన్న వీడియోలు గొప్ప సంచనం అయ్యాయి.

ఇంకా పలువురు యువ గాయనీ మణులతో రొమాన్స్ చేసాడన్న గుసగుసలు వినిపించాయి. ఎఫైర్లు అనగానే యువకథానాయకులు జోరు చూపిస్తుంటారు. కానీ వీళ్లకు ధీటుగానే అనిరుధ్ స్పీడ్ ఉందన్న టాక్ వినిపించింది. ఇక స్టైల్ కంటెంట్ .. ట్రెండ్స్ ని ఫాలో చేయడంలో హీరోలకు ఏమాత్రం తగ్గడని అనిరుధ్ ని చూస్తే అర్థమవుతుంది. పిట్ట చిన్నదైనా కూత ఘనం అన్నట్లే అనిరుధ్ స్పీడ్ ఉంటుంది. ఇక దళపతి `మాస్టర్` ప్రీరిలీజ్ ఈవెంట్లో అనిరుధ్ స్టైల్ ప్రత్యేకించి చర్చకు వచ్చింది. హీరోల్ని కొట్టేసేంత స్మార్ట్ గా ఉన్నాడు మరి. ఆ హెయిర్ కట్.. టక్కు టైతో ఎంతో స్టైలిష్ గా కనిపించాడు అనిరుధ్. కాస్త బక్కచిక్కిన శ్రీరాముడి లా ఉంటాడు కానీ.. అనిరుధ్ లోని ఆ కొంటె కృష్ణుడే డామినేట్ చేయడం ఆసక్తికరం.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-